TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Videos » పంచ్ డైలాగ్స్ తో ఎమ్మెల్యే రోజా చెడుగుడు!..

పంచ్ డైలాగ్స్ తో ఎమ్మెల్యే రోజా చెడుగుడు!..

by Murthy

నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి  కాసేపు కబడ్డీ ఆడి ఆలరించారు. నవంబర్‌ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్‌ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలోని క్రీడా మైదానంలో ‘స్పోర్ట్స్‌ మీట్‌’ నిర్వహిస్తున్నారు.  అలాగే కడప జిల్లా బద్వేలులో 90 వేలకు పైగా మెజారిటీతో అఖండ విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధకు రోజా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఇతర ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ సినిమా డైలాగ్స్‌తో హంగామా చేసేసారు ఎన్నిక ఏదైనా ప్రజలు ఎప్పుడూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని మళ్లీ నిరూపితమైందని నగరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి తేల్చి చెప్పారు.  

ఏ సెంటర్ అయినా, ఎలక్షన్‌ ఏదైనా, ఓన్లీ సింగిల్‌ హ్యాండ్‌.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా సినిమా స్టైల్లో పంచ్‌ డైలాగులు పేల్చారు. ఎవరినైనా సరే సింగిల్‌ హ్యాండ్‌తో మట్టికరిపించగల సత్తా జగన్మోహన్‌రెడ్డికి ఉందన్నారు. బద్వేలులో గెలిచేందుకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలు మూకుమ్మడిగా చేతులు కలిపి.. కుటిల ప్రయత్నాలు చేశారని అన్నారు. అయితే బద్వేల్ ప్రజలు చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలను చితకబాది తరిమికొట్టారని వ్యాఖ్యానించారు. 

బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల సంతోషంతో నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించాయని అభిప్రాయపడ్డారు.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More