TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Uncategorized » పట్టాభికి 14 రోజుల రిమాండ్!.

పట్టాభికి 14 రోజుల రిమాండ్!.

by Murthy

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను పోలీసులు నేడు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. పట్టాభిని ఈ మధ్యాహ్నం తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడకు తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

వాదనల సందర్భంగా పట్టాభికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ, పట్టాభిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్ ను అసభ్య పదజాలంతో దూషించారన్న ఫిర్యాదు మేరకు పట్టాభిపై విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

తనను పోలీసులు కొట్టలేదని టీడీపీ నేత పట్టాభి తెలిపారు.  తాను సీఎంను గాని, ప్రభుత్వ పెద్దలనుగానీ తూలనాడలేదన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపానని చెప్పారు. గతంలో తనపై దాడి జరిగితే దోషులను పట్టుకోలేదని తెలిపారు. ఏపీలో డ్రగ్స్ , గంజాయి వ్యవహారంలో అరోపణలు చేస్తూ ముఖ్యమంత్రిని అసభ్య పద జాలంతో దూషించారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహానికి గురై పట్టాభి ఇంటి పైనా..టీడీపీ కార్యాలయాల పైనా దాడికి దిగారు. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిని బుధవారం రాత్రి పోలీసులు ఆయన నివాసంలో అరెస్ట్ చేసారు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More