TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Uncategorized » ‘దశమగ్రహ’ రూపంలో డైరక్టర్ శంకర్ కి షాక్!..

‘దశమగ్రహ’ రూపంలో డైరక్టర్ శంకర్ కి షాక్!..

by Murthy

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్: ప్రముఖ డైరెక్టర్ శంకర్ మేనల్లుడు రోహిత్ ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఇతడు క్రికెటర్ కూడా. రోహిత్ తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త దామాదరన్ పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. 17 ఏళ్ల అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది, ప్రముఖ క్రికెటర్ తో పాటు అతని తండ్రి, క్రికెట్ అసోషియేషన్ వ్యవస్థాపకుడు, ఇద్దరు కోచ్ లు, క్రికెట్ అసోషియేషన్ సెక్రటరీతో సహ మొత్తం ఐదు మంది మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం కలకలం రేపింది.   పుదుచ్చేరిలో   ఇంటర్ అమ్మాయి ప్రైవేట్ క్రికెట్ శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకుంటోంది. కరోనా కారణంగా శిభిరం మూసివేయడంతో పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ శిక్షణ సంస్థను సంప్రదించింది. అక్కడ కోచ్ ఆ అమ్మాయికి శిక్షణ ఇచ్చే నెపంతో ప్రైవేట్ భాగాలపై తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలున్నాయి.

అతడికి అమ్మాయి వార్నింగ్ ఇచ్చినా పద్ధతి మార్చుకోలేదు. కోచ్ తీరుతో విసిగిపోయిన అమ్మాయి తర్వాత క్రికెటర్ రోహిత్ ను కలిసి ఫిర్యాదు చేసింది. రోహిత్ కూడా సర్దుకుపోయి శిక్షణ తీసుకోవాలని హితబోధ చేశాడట. రోహిత్ తండ్రిని కలిసి ఫిర్యాదు చేస్తే ఆయన అదే మాట అన్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. బాధితురాలు మరో క్రికెట్ కోచ్ జయకుమార్ కు ఫిర్యాదు చేస్తే అతను సర్దుకుపోవాలని ఆ అమ్మాయికి ఉచిత సలహా ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడితే నీకు క్రికెట్ లో శిక్షణ ఇవ్వమని కోచ్ లు తమరైకన్నన్, జయకుమార్ ఆమెను హెచ్చరించారని ఆరోపణలు ఉన్నాయి.

అయితే వీరిని అరెస్ట్ చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ఇదిలావుండగా ఈ ఏడాది జూన్‌‌లో రోహిత్‌‌కి, దర్శకుడు శంకర్ కూతురు ఐశ్వర్యతో వివాహం జరిగింది. ఈ వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హాజరయ్యారు.


Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More