TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Uncategorized » చైనా జర్నిలిస్టు ప్రస్తుతం చావుబతుకుల్లో!.. నిజాలు రాస్తే అంతేనా?!.

చైనా జర్నిలిస్టు ప్రస్తుతం చావుబతుకుల్లో!.. నిజాలు రాస్తే అంతేనా?!.

by Murthy

చైనాకు చెందిన ఓ జర్నలిస్ట్‌ ఝాంగ్‌ జాన్‌(38) గతంలో న్యాయవాదిగా పని చేశారు. 2020లో కరోనా కల్లోలాన్ని వుహాన్ నగరంలోని వాస్తవ పరిస్థితు లను ప్రపంచా నికి తెలియజేసినందుకు, వార్తలు రాసినందుకు ఆమెను జిన్‌పింగ్‌ ప్రభుత్వం జైల్లోపెట్టింది. రెచ్చగొట్టే చర్యల ద్వారా ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ఆరోపణలతో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించారు. ప్రస్తుతం ఝాంగ్ జాన్ ఆరోగ్యం బాగాలేదని, ఎక్కువకాలం బతకదని, ఇక విడిచి పెట్టాలని ఆమె కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. అక్కడి మానవహక్కుల సంఘాలు సైతం ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సైతం చైనా ప్రభుత్వానికి అభ్యర్థన చేసింది.

చైనా ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందుకు చాలానే ఉదాహరణలున్నాయి. ప్రస్తుతం ఝాంగ్‌ చావుబతుకుల్లో ఉన్నారు. చైనా చేస్తున్న ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఆమె ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తుం దని, ఝాంగ్‌జాన్‌కు వైద్యం చాలా అవసరమని ఆమ్నెస్టీ తెలి పింది. కనీసం ఆమె కుటుంబ సభ్యులను కూడా కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదని అక్కడి హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆమె నిరాహారదీక్షను విరమింపజేయడానికి., ఆమెకు అవసరమైన తగిన వైద్య చికిత్సను అందుకోవడానికి ఆమెను తక్షణమే విడుదల చేయాలని చైనా ప్రభుత్వాన్ని ఆమ్నెస్టీ కోరింది.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More