హీరో నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్ లో పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కీలక సూత్రధారిగా గుత్తా సుమన్ ను ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇదే సమయంలోనే ఓవైపు విచారణ కొనసాగుతుండగానే బేగంపేటలో పేకాట ఆడుతూ మరికొందరు పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. బేగంపేట పేకాట కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పేకాట అడ్డాపై పోలీసులు దాడి చేశారు. ఈ అడ్డాని అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. వ్యాపార వేత్తలు..నాయకులతో అరవింద్ అగర్వాల్ కు పరిచయాలు ఉన్నాయి. అరవింద్ అగర్వాల్ వాట్సాప్ లో ఇన్విటేషన్ తో పాటు లొకేషన్ షేర్ చేస్తున్నాడు. అరవింద్ అగర్వాల్ ఫోన్ ని పోలీసులు సీజ్ చేశారు. అరవింద్ అగర్వాల్ తో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరవింద్ అగర్వాల్ ప్రతి పండుగలకు ముఖ్యమైన రోజుల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్టు నగరంలోని వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులతో అరవింద్ అగర్వాల్ కు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అరవింద్ అగర్వాల్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. పేకాట ఆడుతున్నవారిలో సంపన్నులు, పలుకుబడి కలిగినవారు ఉన్నట్లు సమాచారం. ముగ్గురు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని… వారిని వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరానికి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి బేగంపేటకు చేరుకుని వ్యవహారాన్ని సరిచేశారని సమాచారం. అయితే పోలీసులు మాత్రం అదంతా తప్పుడు సమాచారమని ఖండించారు.