TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Trending » ‘అంతం కాదు ప్రారంభం’ : మా ఎన్నికల కమీషనర్ కి ప్రకాశ్ రాజ్ లేఖ!..

‘అంతం కాదు ప్రారంభం’ : మా ఎన్నికల కమీషనర్ కి ప్రకాశ్ రాజ్ లేఖ!..

by Murthy

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు ముగిసి దాదాపు రెండు వారాలు అవుతున్నా పరిశ్రమలో వివాదాలు సద్దుమణగడం లేదు. ‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం ఉందంటూ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు.  ఇటీవ‌ల జ‌రిగిన మా ఎన్నిక‌ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ప్ర‌కాశ్ రాజ్ ముందు నుండి అనుమానం వ్య‌క్తం చేశారు. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినా కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపణలు ఆగట్లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల పోలింగ్‌ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాశ్‌రాజ్‌ తాజాగా కృష్ణమోహన్‌కు లేఖ రాశారు.

ఎన్నికల హాల్‌లోకి వైకాపా కార్యకర్త నూకల సాంబశివరావుని ఎలా అనుమతించారంటూ? ప్రశ్నల వర్షం కురిపించారు. సాంబశివరావు ఎన్నికల హాల్‌లోని ఓటర్లను బెదిరించారంటూ.. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రకాశ్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో మంచు విష్ణుతో సాంబశివరావు ఉన్న కొన్ని ఫొటోలను కృష్ణమోహన్‌కు పంపించారు. అంతేకాకుండా జగ్గయ్యపేటకు చెందిన సాంబశివరావుపై క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. మరోవైపు, ఈ వీడియోలను అతి త్వరలో బయటపెడతానని ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు. 

జగ్గయ్యపేటకు చెందిన సాంబశివరావుపై క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. మరోవైపు, ఈ వీడియోలను అతి త్వరలో బయటపెడతానని ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. ‘ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటికైనా మాకు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వండి. ఎన్నికల ఎలా జరిగాయి.. పోలింగ్‌ బూత్‌లో అసలేం జరిగిందో ప్రపంచానికి తెలియజేయనివ్వండి’’ అని పేర్కొన్నారు.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More