TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Trending » టీడీపీ నేత పట్టాభి వీడియో!…ఇంకా అజ్ఞాతంలోనేనా?!.

టీడీపీ నేత పట్టాభి వీడియో!…ఇంకా అజ్ఞాతంలోనేనా?!.

by Murthy

హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన ఆయన.. తర్వాత హనుమాన్ జంక్షన్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తాను ఉన్న వాహనంతోపాటు మరో రెండు వాహనాల్లో శనివారం సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి జైలు నుంచి  విజయవాడకు బయల్దేరారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్దకు చేరుకోగానే పోలీసులు భారీగా మోహరించారు. పట్టాభిరామ్ కారుతో పాటు మరో రెండు వాహనాలనే అనుమతించారు. మిగతా వాహనాలను అక్కడే ఆపేశారు. పట్టాభి ఇంటికి చేరుకోలేదని, హైదరాబాద్ వైపు వెళ్లారని సన్నిహితులు చెప్తున్నారు.  పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకుంటారనే ఉద్దేశంతో.. ముందు జాగ్రత్తగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రచారమూ జరిగింది. ఇప్పుడు తాజాగా పట్టాభి మాల్దీవులకు వెళ్లినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీటికి బలం చేకూరుస్తూ.. పట్టాభి విమానంలో కూర్చుని ఉన్న ఫోటోలు, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫోటోలు వైరలవుతున్నాయి. 

కాగా, ఓ వీడియో విడుదల చేసిన పట్టాభి.. అన్ని పుకార్లకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.  తాను కుటుంబంతో కలిసి బయటకి వచ్చా.. అతి త్వరలో మళ్లీ నేను వచ్చి నా విధి నేను నిర్వహిస్తానంటూ వీడియోలో పేర్కొన్నారు.. తప్పుడు కేసులకు నేను భయపడను అంటూ స్పష్టం చేసిన ఆయన.. నా ఇంటి పై వైసీపీ నేతలు జరిపిన దాడిలో నా కుమార్తె భయ బ్రాంతులకు గురైంది.. ఒక తండ్రిగా నా కుమార్తె బాధ్యత నేను నిర్వర్తిస్తా.. నా కుమార్తె, నా భార్యతో నేను బయటకెళ్తే అనేక అర్ధాలు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి స్పందిస్తూ వీడియో విడుదల చేశారు.. అయితే, తాను ఎక్కడ ఉన్నాననే విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచారు పట్టాభి.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More