ఎన్సీబీ అధికారులు ఆఖరి నిమిషంలో కోర్టుకు సమర్పించిన ఆధారాలు బలంగా ఉండడంతో.. షారూక్ కు, ఆర్యన్ కు మరోసారి నిరాశ తప్పలేదు. జైలులో ఆర్యన్ ఖాన్ ఆహారం తీసుకోవడం లేదని.. తన వంతు ఆహారాన్ని తోటి ఖైదీలకు ఇచ్చేస్తున్నాడనీ తెలుస్తోంది. అక్టోబర్ 3న గోవాకు చెందిన క్రూజ్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు.. జరిపిన దాడుల్లో ఆర్యన్ ఖాన్, మూన్‌మూన్ ధామేచ, అర్బాజ్ మర్చంట్ సహా ఎనిమిది మంది ప్రముఖుల పిల్లలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక మార్లు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. కానీ ఆర్యన్ ఖాన్ కు కోర్టు పదేపదే షాక్ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా మరోమారు కోర్టులో చుక్కెదురైంది. ఆర్యన్ ఖాన్ తరపున వాదించిన న్యాయవాదులు పదేపదే బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించినప్పటికీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పదేపదే తిరస్కరణకు గురి అవుతూ వచ్చింది .
చాలా పెద్ద వాళ్ళు ఉన్నారని.. వాళ్లందరి గురించి తెలియాలంటే తమకు కొన్ని రోజులు సమయం పడుతుందని ఇప్పటికే ఎన్సీబీ కోర్టుకు తెలిపింది. అందుకే రెండు సార్లు ఆర్యన్ ఖాన్ బెయిల్ కూడా తిరస్కరించింది కోర్టు. బెయిల్ నిరాకరించిన వెంటనే ఆర్యన్ ఖాన్ ను పోలీసులు, ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. ఆర్యన్ తో పాటు మరో ఇద్దరికి కూడా కోర్టు బెయిల్ నిరాకరిం చింది. ఈనెల 3వ తేదీన అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ అప్పట్నుంచి రిమాండ్ లోనే ఉన్నాడు. ఈరోజు ఆర్యన్ కు బెయిల్ వస్తుందని షారూక్ దంపతులు భావించారు.
ఈ మేరకు పోలీస్ స్టేషన్ దగ్గర తమ సొంత వాహనాల్ని ఉంచారు. పూచికత్తు సమర్పించేందుకు, బెయిల్ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా రాత్రిలోపు ఆర్యన్ ను ఇంటికి తీసుకెళ్లే విధంగా, వేగంగా ఫార్మాలిటీస్ పూర్తిచేసేందుకు మరో ఇద్దరు లాయర్లను నియమించారు. అయితే కింగ్ ఖాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.మూడోసారి కూడా ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాలేదు. ఈ తీర్పు చూసి షారుక్ ఖాన్ సహా అతడి కుటుంబం కూడా షాక్ అయిపోయారు. మూడోసారి కచ్చితంగా బెయిల్ వస్తుందని అంతా ఊహించిన తరుణంలో మరోసారి సంచలన తీర్పు వచ్చింది.