దసరా తర్వాత రోజు మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రతీ ఏటా నిర్వహించే కార్యక్రమం ‘దత్తన్న అలయ్ బలయ్’. నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు కలుసుకున్నారు. పార్టీలకు అతీతంగా నేతలంతా కలుసుకునే ఈ కార్యక్రమాని ఈసారి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి కళ్లకు కట్టేలా అలయ్ బలయ్‌లో కళాకారుల నృత్యాలు, తెలంగాణ షడ్రుచుల వంటకాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఒకరినొకరు కలుసుకోవడం, ఆలింగనం చేసుకోవడం అలయ్ బలయ్ ప్రత్యేకత కాగా.. ఈ ఏడాది కూడా అదే తీరు కొనసాగింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మంచు విష్ణు స్టేజిపై పక్క పక్కనే ఉన్నారు. అయితే స్టేజ్ పై మంచు విష్ణు ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ విచ్చేయగా పవన్ కళ్యాణ్ విష్ణును పట్టించుకోకుండానే పక్కకు వెళ్లారు. విష్ణు పలకరించేందుకు ప్రయత్నించినా పవన్ పట్టించుకోనట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దీనికి సంబంధించిన వీడియోను విష్ణు పోస్ట్ చేస్తూ.. వీడియో చివర్లో ఎవరు ఉన్నారో చెప్పుకోండి అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజనులు ఎవరికి తోచిన కామెంట్లు చేస్తు్న్నారు.