TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Trending » ‘మా’ కు రాజీనామాలు అందలేదు!.: మంచు విష్ణు

‘మా’ కు రాజీనామాలు అందలేదు!.: మంచు విష్ణు

by Murthy

‘మా’ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ  విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో మంచు విష్ణుని పవన్‌కల్యాణ్‌ ఏమాత్రం పట్టించుకోలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని విష్ణు తెలిపారు. ‘‘చిరంజీవి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. ‘అలయ్‌ బలాయ్‌’ కార్యక్రమంలో స్టేజ్‌ పైకి రాకముందే పవన్‌క్యలాణ్‌తో మాట్లాడాను. మేమిద్దరం చాలా విషయాలపై చర్చించుకున్నాం. ప్రోటోకాల్‌ ప్రకారం మేమిద్దరం ేస్టజ్‌పై మాట్లాడుకోలేదు.  ేస్టజ్‌ మీద ఏం జరిగిందో అది మాత్రమే జనాలకు తెలుసు. అంతకుముందు ఏం జరిగిందనే ఎవరకీ తెలీదు. పవన్‌కల్యాణ్‌కి ఫ్యాన్స్‌ సంఖ్య ఎక్కువ వాళ్లని సర్‌ప్రైజ్‌ చేయడానికి నేను ట్విటర్‌లో ఆ వీడియో షేర్‌ చేశానని వివరించారు.

ప్రకాశ్‌రాజ్‌, నాగబాబుగారు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాటిని ఆమోదించడం లేదు. త్వరలో వారికి లేఖ పంపిస్తాను. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లో గెలిచిన సభ్యులు రాజీనామా చేసినట్లు మీడియా ద్వారా నాకు తెలిసింది. ఒక్కరి నుంచి మాత్రమే నాకు రాజీనామా అందింది. మిగిలిన వాళ్ల నుంచి కూడా వచ్చాక.. మేమంతా ఓ సారి చర్చించుకుని పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.  చాలా విషయాల్లో తను బైలాస్ మారుస్తానని, జనరల్ బాడీ మీటింగ్ లో ప్రపోజల్ పెడతామని, అలాగే మెంబర్ షిప్ ను స్ర్టిక్ట్ చేయాలని, ఎవరు పడితే వాళ్ళు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మెంబర్స్ కాకుండా చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు చెప్పారు.

పెద్దల అంగీకారంతో చాలా విషయాల్లో బైలాస్ మారుస్తామని, జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ ప్రపోజల్ పెడతామన్నారు. ‘మా’ సభ్యత్వాన్ని స్ర్టిక్ట్ చేయాలని, ఎవరు పడితే వాళ్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు కాకుండా చర్యలు తీసుకుంటాని చెప్పారు. ప్యానల్ సభ్యులు మాదాలరవి, శివబాలాజీ, బాబూ మోహన్ పాల్గొన్నారు. తిరుమల దర్శనం బాగా జరిగిందని, తమ నియోజకవర్గం యమ్మెల్యే  బాగా హెల్ప్ చేశారని మంచు విష్ణు ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More