ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సంవత్సరం కూడా భారత ఆర్మీ సైనికులతో దీపావళి జరుపుకోనున్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీలోని నౌషేరా సెక్టార్లోని ఫార్వర్డ్ ఏరియాలో ప్రధాని మోదీ ఈరోజు జవాన్లతో గడపనున్నారు. ఈరోజు దీపావళి సందర్భంగా, ఢిల్లీ మెట్రో తన చివరి రైలు సేవలను రాత్రి 10 గంటలకు గ్రీన్ లైన్ మినహా అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి నడుపుతుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తెలిపింది. “దీపావళి పండుగ దృష్ట్యా, నవంబర్ 4న చివరి మెట్రో రైలు సర్వీస్, గ్రీన్ లైన్ మినహా అన్ని మెట్రో లైన్ల టెర్మినల్ స్టేషన్ల నుండి రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుందని DMRC ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి సైనికులతో సంభాషిస్తారు. సైనికుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులతో భద్రతా బలగాల ఎన్కౌంటర్, హింస చెలరేగిన నేపథ్యంలో ఆయన యూనియన్ టెరిటరీ పర్యటనకు వచ్చారు.
2014 నుండి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ , కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ & కాశ్మీర్ వంటి రాష్ట్రాలలోని ఫార్వర్డ్ ఏరియాలలో సైనికులతో సమయం గడపడం ద్వారా ప్రధాన మంత్రి దీపావళిని జరుపుకుంటున్నారు. గత కొంత కాలంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. ఇందుకు తగ్గట్లుగానే భద్రతా బలగాలు వరస ఎన్కౌంటర్లలో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు. కాగా తాజాగా ప్రధాని పర్యటనతో భద్రతా బలగాల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచనుంది.