కేరళలో విషాదం జరిగింది. కొచ్ఛికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(24) రన్నరప్ అంజనా షాజన్(25) చనిపోయారు. కొచ్ఛి సమీపంలోని వైటిల్లా ఎడపల్లి దగ్గర వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఎర్నాకులం బైపాస్ లోని హాలిడే ఇన్ ముందు అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అటుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అన్సీ కబీర్, అంజనా అక్కడికక్కడే కన్నుమూశారు. వీరితో పాటు కారులో మరో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వారిలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఈ ఇద్దరూ మాత్రం అందానిలోకాలకు వెళ్లిపోయారు. .
అన్సీ, అంజనా డెడ్ బాడీలను పలారి వట్టంలోని ఎర్నాకులం మెడికల్ సెంటర్ ఆస్పత్రికి తరలించారు. అన్సీ కబీర్ ది తిరువనంతపురం కాగా.. అంజనా షాజాన్ కొచ్ఛికి చెందిన వారు. వీరిద్దరూ మిస్ కేరళ 2019 కాంపిటీషన్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఈ ప్రయాణానికి ముందే అన్సీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ‘ఇట్స్ టైమ్ టు గో’ అంటూ ఓ వీడియోనుషేర్ చేసింది. ఆమె ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే ప్రమాదం చోటుచేసుకుంది. మిస్ కేరళ 2019 కాంపిటీషన్ జరిగినప్పటి నుంచి అన్సీ, అంజనా మంచి స్నేహితులయ్యారు. ఈ పోటీలో అన్సీ విజేతగా నిలవగా.. అంజనా రన్నరప్ గా నిలిచింది. ఈ యాక్సిడెంట్ పై స్పందించిన పోలీసులు.. స్పీడ్ గా వెళ్తున్న వీరి వాహనానికి బైక్ అడ్డంగా రావడంతో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కంట్రోల్ చేయలేకపోయాడని.. అందుకే యాక్సిడెంట్ జరిగిందని వివరించారు.