అత్తగారింటికి వెళ్లిన ఎస్సై గ్రామంలో ఉన్న బైక్ లకు ఫైన్ విధించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రావాడ గ్రామంలో చోటుచేసుకుంది. బిక్కవోలు ఎస్సై శ్రీనివాస్ పండక్కి పండ్రావాడ గ్రామంలోని అత్తగారింటికి వచ్చారు. పండక్కి వచ్చిన ఆయన గ్రామంలో ఉన్న బైకులకు ఫైన్ లు వేశారు. ఆన్ లైన్ ద్వారా రెండు బైక్ లకు చలానా విధించారు. ఆ ఫైన్ లు కూడా భారీగా ఉన్నాయి. ఒక బైక్ కు రూ. 10,070., మరో బైక్ కు రూ. 5,035 ఫైన్ వేశారు.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధి అక్రమంగా కేసులు స్థానికులు ఆందోళనకు దిగారు. సామర్లకోట మండలం పండ్రవాడలో రోడ్డు పక్కన ఆపిన బైకుల్ని ఎస్సై శ్రీనివాస్ ఫొటోలు తీసి అక్రమంగా రూ.10 వేలు జరిమానా విధించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎస్సై తన మావయ్య ఇంటికి వెళ్తుండగా రోడ్డు పక్కన ఉన్న విజయ్‌కుమార్, శ్రీనివాన్ వాహనాలు ఒక్కో దానికి రూ.5085 చొప్పున జరిమానా విధించారని ఆరోపించారు.
దీంతో గ్రామస్థులు ఎస్సైపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పోలీస్ స్టేషన్ పరిధిలో లేనప్పటికీ ఫైన్ వేయడంపై మండిపడ్డారు. ఆయన అత్తగారింటికి వెళ్లి గొడవపడ్డారు. వారిపై ఎస్సై కూడా సీరియస్ అయ్యారు. దౌర్జన్యం చేశారంటూ కేసులు బుక్ చేస్తానని హెచ్చరించారు. దీంతో, జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామంటూ ఎస్సైకి గ్రామస్థులు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న సామర్లకోట ఎస్సై స్థానికులతో చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు అంటున్నారు.