మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు ఇద్దరూ కలిసి ఏదైనా సినిమా వేడుకలో ఒకే వేదిక మీద కనిపిస్తే ఫ్యాన్స్ కి పండుగే. అలాంటిది బాలయ్య, చిరు కలిసి ఒకే షో లో కనిపిస్తే ఇంక స్క్రీన్ దద్దరిల్లి పోవాల్సిందే, దీనికి సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా రానున్న టాక్ షో ”అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే” ప్రోగ్రామ్ లో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి పాల్గొననున్నారట. ఈ కార్యక్రమానికి తొలి ఎపిసోడ్లో అతిథిగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్నారని ఫిలింనగర్ టాక్. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది. నందమూరి బాలకృష్ణ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఓ వైపు వెండితెరపై కథానాయకుడిగా జోరు చూపిస్తూనే ఇప్పుడు ఓటీటీ వేదికగానూ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఆదివారం ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది.
బాలకృష్ణ తమ ఓటీటీ వేదిక కోసం ఓ టాక్ షో చేస్తున్నట్లు సదరు సంస్థ తెలియజేసింది. ఈ టాక్ షో తొలి ఎపిసోడ్ దీపావళి సందర్భంగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దాదాపు పది మందికి పైగా స్టార్లతో ఈ షో తొలి సీజన్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ టాక్ షో కోసం ‘అన్ స్టాపబుల్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ విడుదలకు సిద్ధమవుతుండగా.. గోపీచంద్ మలినేనితో చేయనున్న కొత్త చిత్రం పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది.
ఈ టాక్ షో ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మి అతిథులుగా కనిపిస్తారట. తొలి ఎపిసోడ్లో మంచు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేయడానికి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. అలాగే అక్కినేని నాగార్జున, అతని కుమారులతో బాలకృష్ణ ఇంటర్వ్యూ కు సంబంధించి చర్చలు నడుస్తున్నాయట. ఇక పూరీ జగన్, క్రిస్ వంటి దర్శకుల సంగతి సరేసరి. బాలయ్యతో పనిచేసిన దర్శకులు, తారలు కూడా ఈ టాక్ షోలో మెరవనున్నారు. నవంబర్ లో ఈ టాక్ షో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి 8 ఎపిసోడ్స్ ఉంటుందని టాక్.