తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మరికాసేట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ జాప్యంతో చంద్రబాబు హైదరాబాద్ వస్తున్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ వచ్చాక మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశానికి ప్రయత్నించి విఫలం అయినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కినట్టుగా చెబుతున్నారు.. కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమయం ఇచ్చినప్పుడు మళ్లీ ఢిల్లీకి వచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
సోమవారం ఉదయం ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందం రాష్ట్రపతిని కలిసి ఏపీలో పరిస్థితులపై ఫిర్యాదు చేశారు . రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. సోమవారం రాత్రి ఢిల్లీలోనే బస చేశారు. మీడియా ప్రతినిధులతో నిన్న రాత్రి మాట్లాడిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయ పరిణామాలు, రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోమారనున్న రాజకీయ సమీకరణాలపై మాట్లాడారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తో సమావేశం బాగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను కూడా చంద్రబాబు కలవాలనుకున్నారు. అయితే అపాయింట్మెంట్లు ఖరారు కాకపోవడంతో హైదరాబాద్ వచ్చేస్తున్నారు. వారి అపాయింట్మెంట్లు దొరికాక మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.