ఈ కామర్స్ కంపెనీల పండగ సేల్స్ ఆఫర్స్ ఊహించని లాభాల్ని ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్డర్లు చిన్న నగరాలు చిన్న పట్టణాలు నుంచి వస్తూ ఉండటంతో ఈకామర్స్ కంపెనీల హవా దేశం యావత్తూ ఎలా వ్యాపించిందో అర్ధం అవుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఈకామర్స్ కంపెనీల హవా తో చిన్నతరహా మధ్య తరహా వ్యాపారాలు అన్నీ అటకెక్కే పరిస్థితులలో ఉన్నాయని అంచనాలు వస్తున్నాయి సీజన్ ఇంకా పూర్తి కాకుండానే దేశ వ్యాప్తంగా 22 వేల కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పండుగ సమయంలో కొత్త వస్తువులు కొనడం కామన్. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పలు కంపెనీలు రెడీ అయ్యాయి. ఫెస్టివల్ పేరుతో ప్రత్యేక సేల్స్ ప్రారంభిస్తు న్నాయి. కొనుగోలుదారులను అట్రాక్ట్ చేసేందుకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నాయి.
పండుగ సీజన్లో షాపింగ్ చేస్తే ఎన్నో ఆఫర్స్ ఉంటాయి. పైగా ఎంతో డబ్బుని మీరు ఆదా చేసుకోచ్చు. ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ ముగిసిన తరువాత, ఇప్పుడు కంపెనీ దీపావళి సేల్‌ను మొదలు పెట్టింది. దీనిలో భాగంగా అదిరే డిస్కౌంట్స్ ని కస్టమర్స్ పొందొచ్చు. ఈ సేల్ అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో SBI బ్యాంక్ కార్డుల వినియోగంపై 10 శాతం తగ్గింపును పొందొచ్చు.
షావోమీ తన ఉత్పత్తులపై సుమారు రూ.5వేల నుంచి రూ.75వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. అంతేకాదు రివార్డ్ ఎంఐ ఇన్స్టంట్ కూపన్ల ద్వారా రూ.5వేల వరకు తగ్గింపును ప్రకటించింది. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు కొనుగోలుపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ దీనికి అదనం. దీపావళి విత్ ఎమ్ఐ సేల్‌లో షావోమీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎమ్ఐ బాక్స్ 4కే అలాగే దాని ఐవోటీ పరికరాల ధరపై తగ్గింపు ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో టీఎల్సీ iFFALCON 43-అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీని రూ. 21,999 ధర వద్ద అందిస్తోంది. ఇక, 55 -అంగుళాల 4K LED ఆండ్రాయిడ్ టీవీని రూ. 43,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.