హైదరాబాద్ : మహానగరం భాగ్యనగరం గా పేరున్న హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు చూడవలసిన పర్యాటక ప్రదేశాలు ఎనో ఉన్నాయి. హైదరాబాద్ ఎప్పుడూ ట్రాఫిక్ మరియు వేరే దేశాల నుండి వచ్చే ర్యాటకుల తాకిడితో కిటకిటలాడుతు ఉంటుంది. అలాంటి ఈ సిటీ లో కూడా రాత్రి అయితే కొన్ని దెయ్యాలు తిరిగే భయంకరమైన మిస్టీరియస్ ప్రదేశాలు ఉన్నాయి.
మిస్టీరియస్ ప్రదేశాలు లేదా దెయ్యాలు తిరిగే ప్రదేశాలు అనగానే చాల మంది భయపడతారు కానీ మరి కొందరు అసలు అలాంటివి ఏమి ఉండవు అని కొట్టి పారేస్తారు. మరి కొందరు దాని వెనుక దాగిఉన్న మిస్టరీ ఏంటో అక్కడికి వెళ్లి స్వయంగా వెళ్లి తెలుసుకునే సాహసం చేస్తారు. కానీ ఇంకొంతమంది తమకు తమకు దెయ్యాలు కనిపించాయి అంటూ తమ చేదు అనుభవాలు చెప్పి గజగజ వణుకుతుంటారు.
1) కుందన్ బాగ్ లో దెయ్యాల ఇళ్లు
కుందన్ బాగ్ లో దెయ్యాల ఇళ్లు కథ వింటే అచ్చం సినిమాల్లో చూపించే కథలనే అనిపిస్తుంది, కుందన్‌బాగ్ హైదరాబాద్‌లో ఒక నాగరిక ప్రాంతం. కుందన్ బాగ్ లోని ఒక ఇంట్లో ఒక తల్లి తన ఇద్దరు కూతుర్లు నివసిస్తూ ఉండేవారు. అయితే వాళ్లు రాత్రైతే చాలు ముగ్గురు కొవ్వత్తులు పట్టుకొని బాల్కనీ లో తిరుగుతూ ఉండేవారు, అలాగే వాళ్ల ఇంటి ముంది ఒక రక్తం బాటిల్ కూడా లభించడం తో చుట్టు పక్కల ఉండేవారి భయపడి ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూసే వారు కాదు.

ఈ విషయాలు ఏమి తెలియని ఒక దొంగ ఒక రోజు ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు మంచం మీద పది ఉన్న మూడు కుళ్లిపోయిన డెడ్ బాడీలు చూసి షాక్ అయ్యాడు, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. డెడ్ బాడీలు పోస్టమోర్టమ్ రిపోర్ట్ లో వాళ్లు ఆరు నెలల క్రితం చనిపోయారు అని చెప్పారు. దీంతో తాము రోజు కొవ్వతులు పట్టుకొని తిరుగుతన్నట్టు గా చూసి దెయ్యాలను అని తెలుసుకున్న స్థానికులు ఖంగుతిన్నారు , అప్పటి నుండి ఆ వైవు అస్సలు ఎవ్వరు వెళ్లే సాహసం చేయలేదు.
2) రామోజీ ఫిలిం సిటీ
ఇండియా లో అతి పెద్ద ఫిలిం సిటీ అయిన రామోజీ ఫిలిం సిటీ లో కుడా దయ్యాలు తిరుగుతూ ఉంటాయి అంటే ఎవరైనా నమ్ముతారా ? కాని అక్కడే రాత్రి సమయం లో జరిగే సంఘటనలు చూస్తే నమ్మాల్సిందే అంటారు కొందరు. సినిమా షూటింగ్ లకు, టూరిస్టుల ఎప్పుడు ఎంతో సందడిగా ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ.

కానీ చీకటి పడితే పరిస్థితి మొత్తం బిన్నంగా ఉంటుంది, రామోజీ ఫిలిం సిటీ లో కూడా ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అని చాల మంది చెపుతారు. షూటింగ్ లు జరుగుతున్న సమయాల్లో అద్దాల్లో వింత వింత పదాలు కనపడుతూ ఉండడం, ఎవరు వెంటాడినట్టు అనిపించడం, బాత్ రూమ్ డోర్ లు కొట్టడం ఇలా పలు రకాల సంఘటనలు అనుభవించనట్టు షూటింగ్ కి వెళ్లిన వారు ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నట్టు సమాచారం.
ఒక కథనం ప్రకారం నిజాంల కాలంలో ఈ ప్రాంతంలో యుద్ధాలు జరిగాయని అందులో మరణించిన సైనికులు ఇప్పుడు ఆత్మలుగా మారి ఈ ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటారు అని నమ్ముతుంటారు .
3) శంషాబాద్ ఎయిర్ పోర్ట్
ఎప్పుడూ అంతర్జాతీయ మరియు జాతీయ విమాన సర్వీసులతో బిజీ గా ఉండే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కుముద హైదరాబాద్ లో ని ఒక దెయ్యాలు తిరిగే భయంకరమైన ప్రదేశంగా పలువురు చెప్తూ ఉంటారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మించేప్పుడు చాల మంది అక్కడ చనిపోయారు అని, చనిపోయిన వాళ్ల శవాలను విమానాశ్రయం కిందే పూడ్చిపెట్టారు అని అలా పుడిచిపెట్టిన వాడి ఆత్మలు శాంతి లేక ఎయిర్ పోర్ట్
లోనే తిరుగుతున్నాయి అని చాల మంది ఇప్పటికి నమ్ముతున్నారు. ఎయిర్ పోర్ట్ ఉద్యోగులు ఒకసారి తలను 360 డిగ్రీల కోణంలో ఒక వ్యక్తి తిప్పడం చూసి షాక్ తిన్నారట.

అలాగే ఒకసారి రన్‌వేపై తెల్లని చీరలో ఒక లేడీ డ్యాన్స్ చేయడాన్ని చూసిన ఎయిర్వేస్ పైలట్ వెంటనే విమానాన్ని ఆపాడు. ఇలా అనేక సంఘటనల జరుగుతున్న నేపధ్యంలో ఈ విమానాశ్రయం హైదరాబాద్ లోని భయానక ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది.
4) బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 స్మశానం
హైదరాబాద్ సిటీ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉండే స్మశానం దాని చుట్టూ ప్రక్కల ప్రాంతాలు కూడా దెయ్యాలు కనిపించే ఒక స్పాట్ గా, మరియు అక్కడ ఎన్నో విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొన్నట్లు స్థానికులు చెబుతుంటారు.

ఒకప్పుడు నిజాం రాజ్యంలో ఈ ప్రాంతం అటవీ ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు రాత్రైతే చాలు ఆ స్మశానం చుట్టుపక్కల జనాలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. ఈ ప్రాంతంలోఅనేక సార్లు వీధి దీపాలు యమవుతుంటాయాని, అక్కడ వెళ్లేప్పుడు వాహనాల టైర్లు పదే పదే టైర్ పంక్చర్ లను అవుతుంటాయని చెబుతుంటారు. వీటి తో పాటు రాత్రి సమయాల్లో ఇక్కడ యంకరమైన అరుపులను, శబ్ధాలను వినపడతాయని స్థానికులు చెప్తుంటారు. దానితో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 స్మశానం చుట్టూ ఉండే ప్రాంతం మిస్టరీ ప్రదేశంగా మారిపోయింది.
5) గోల్కొండ కోట:
హైదరాబాద్ లోని నిత్యం పర్యాటకులతో కీటకటలాడుతూ ఉండే పురాతన కట్టడం గోల్కొండ కోట.రాత్రైతే చాలు ఈ కోటలో ఎన్నో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి అని అక్కడ కాపాలా ఉండే వారు చెప్తూ ఉంటారు. ఈ చారిత్రాత్మక కట్టడాన్ని 13వ శతాబ్ధంలో కాకతీయులు నిర్మించారు.

చాల మాది పర్యాటకులు సైతం ఈ కోటలో ఒక నీడ నృత్యం చేయడాన్ని చూసినట్టు చెబుతుంటారు. దానితో పాటు అకస్మాత్తుగా కొన్ని పాత్రలను ఎవరో తమపై విసరడం, భయంకరంగా ఏడుపులు వినిస్పిస్తున్నట్టు పర్యాటకులు చెప్తారు.ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వల్లే చీకటి పడిన తరువాత కోటలోకి పర్యాటకులను అనుమతించరని అంటారు.