తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్ అక్కడి బస్టాండ్ తనిఖీలు చేపట్టారు. బస్టాండ్లలో అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయో..? లేదో..? తెలుసుకోవడానికి స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. ఆర్టీసీ బస్టాండ్‌లో సౌకర్యాల గురించి ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆర్టీసీలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. మిర్యాలగూడలో అధికారులతోనూ సజ్జనార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని మీడియాకు చెప్పారు. రెండేళ్లుగా 30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని తెలిపారు.
ఇక, నల్గొండ బస్టాండ్‌లో ఉన్న స్టాల్స్‌ను పరిశీలించారు. అందులో అమ్ముతున్న తినుబండరాలను కూడా పరిశీలించారు. అంతేకాకుండా బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న బస్సులను కూడా పరిశీలించారు. అలాగే నల్గొండ రీజియన్ ఆర్టీసీ అధికారులతో సజ్జనార్ సమావేశమయ్యారు. అలాగే ఆర్టీసీకి సంబంధించిన కార్గో సేవలను కూడా ఆయన ఈ సందర్భంగా సజ్జనార్ పరిశీలించారు. సజ్జనార్ ఇలా చేయడం చూసిన నెటిజన్లు.. ఆయన చర్యలను ప్రశంసిస్తున్నారు. సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీతోనే సాధ్యమని అని చెప్పారు. నల్గొండ రీజియన్ ఆర్టీసీ అధికారులతో సజ్జనార్ సమావేశమయ్యారు.
ఇంతకుముందు సజ్జనార్.. హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సులో సాధారణ ప్రయాణికుడిగా టికెట్ తీసుకుని ప్రయాణం చేశారు. ఈ సమయంలో బస్సుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుడా MGBS పరిసరాలను పరిశీలించారు. అక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.