దేశంలో ఎంపీలకు అపరిమితమైన సౌకర్యాలుంటాయి. టెలిఫోన్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపు, విమాన, రైలు ప్రయాణాలు ఉచితం లేదా రాయితీలు వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. అయితే ఇకపై అలాంటి సౌకర్యాల్లో ఇప్పుడు కోత పడనుంది. ఇప్పటివరకు ఉచితంగా విమానాల్లో ప్రయాణం చేసే ఎంపీలు భవిష్యత్లో టిక్కెట్ కొని ప్రయాణించాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఇదంతా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిరిండియా ప్రైవేట్ పరం కావడమే. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను వేలంపాటలో టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో టాటా గ్రూప్ వెంటనే ఎంపీల ఉచిత విమాన ప్రయాణాలను కట్ చేసింది. టాటా గ్రూప్ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఎంపీలు ఎయిరిండియాలో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసి అనంతరం పార్లమెంట్ సచివాలయానికి రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
కేంద్రియ విద్యాలయాల్లో ఎంపీలకు 10 శాతం రిజర్వేన్ ఉండేది. ఇది సరిపోకపోతే కేంద్రమంత్రి విచక్షణతో ఎంపీలు మరిన్ని సీట్లను తీసుకునేవారు. ఇపుడు ఆ రిజర్వేషన్ ప్రక్రియను కూడా కేంద్రం రద్దుచేసేసింది. కేంద్రియ విద్యాలయాల సీట్లలో ఎంపీల కోటాను కేంద్రం ఎందుకు రద్దుచేసిందో తెలియటంలేదు. ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్ ఫండ్లను కూడా నిలిపేసింది. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఏటా ప్రతి ఎంపీకి కేంద్రం రు. 5 కోట్లను మంజూరు చేస్తోంది.
కేంద్రమంత్రులు, ఎంపీల కోసం విమానాలను గంటపాటు నిలిపేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అదే అంతకుముందు కచ్చితమైన ప్రయాణ సమాయాన్ని పాటించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏదేమైనా ఎంపీల సౌకర్యాల్లో కోతలు అయితే మొదలయ్యాయి.