తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నవంబర్ 4, గురువారం, మామల్లపురంలోని ఒక ఆలయంలో అందించే 'అన్నదానం'ని తిరస్కరించిన నారికురవర్ మహిళ అశ్వినిని కలిశారు. అశ్విని ఆహ్వానం మేరకు సీఎం స్టాలిన్ కూడా మామల్లపురంలోని ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో కాసేపు మాట్లాడారు. నారికురవర్, ఇరులర్ల ప్రజలు నివసించే మామల్లాపురం సమీపంలోని పూంచేరిలో జరిగిన కార్యక్రమంలో గురువారం కూడా 81 మందికి ఇళ్ల పట్టాలను సీఎం స్టాలిన్ అందించారు. ఈ సందర్భంగా రూ.10 లక్షలతో అంగన్వాడీ, పంచాయతీ యూనియన్ పాఠశాలల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. అశ్వని అనే మహిళ నరిక్కువర కులానికి చెందినది. తమిళనాడులోని మామళ్లాపురం గ్రామంలో ఉంటుంది. అక్కడ స్థల శయన పెరుమాల్ గుడి ఉంటుంది. రాష్ట్రమంతా దాదాపు 750 గుళ్లలో ఉచిత అన్నదానం చేస్తున్నట్టే అక్కడ కూడా చేస్తారు. కానీ, అశ్వినికి ఆ అన్నదానం ఇవ్వకుండా నిరాకరించారు. కారణమేంటంటే ఆమె కులం తక్కువ అని.. ఊరు ఊరు తిరిగి పూసల దండలు అమ్ముకుని బతికే నరక్కువర కులం ఎస్సీ, ఎస్టీల కిందకు రాదు. అట్లా అని బీసీ కూడా కాదు. ఎంబీసీ అంటే.. మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాస్ అన్నమాట. అన్నదానం నిరాకరించడంతో అశ్విని గుడిపెద్దలతో గొడవకు దిగింది. ఇది అక్కడ ఉన్న కొంతమంది ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ గా మారి తమిళనాడులో సంచలనం రేపింది. ఈ విషయం ఎమ్మెల్యే, మంత్రుల స్థాయి దాటి ముఖ్యమంత్రి స్టాలిన్ దాకా వెళ్లింది. దీన్ని అలా చూసి ఊరకే వదిలేయలేదు సీఎం స్టాలిన్.. తన రాజకీయ పరణితిని చాటుకున్నారు. నేరుగా ఆమె ఇంటికి వెళ్లారు. జరిగిన విషయం మొత్తం తెలుసుకున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం తన రూటే వేరు అన్నట్టుగా ఉంటుంది ఆయన తీరు. తను అధికారం చేపట్టినప్పటి నుంచి ఎవరూ ఊహించిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ సంబ్రమాశ్చార్యాల్లో ముంచెత్తుతున్నారు.