కరోనా వైరస్ సమయంలో విధించిన లొక్డౌన్ కారణంగా ఇండియా లో ఇంటర్నెట్ ఉపోయోగించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది దానితో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం జనాలు ఓటీటీ ప్లాటుఫార్మ్స్ అయిన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ చూసే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నెట్ఫ్లిక్స్ పిట్టకథలు అనే పేరుతో ఒక కొత్త వెబ్ సిరీస్ ని వచ్చే నెల ఫిబ్రవరి 19 నుండి ప్రసారం చేయనుంది.
ఈ పిట్టకథలు వెబ్ సిరీస్ ని స్వయంగా నెట్ఫ్లిక్స్ నిర్మిస్తుంది దానికి సంబంధించిన టీజర్ ని ఈ రోజు విడుదల చేసింది. పిట్టకథలు టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ టీజర్ లో మొత్తం నలుగురు మహిళలకు సంబందించిన కథలు ఉన్నాయి. నాలుగు కథల కోసం పలు భాషల్లో క్రేజ్ ఉన్న టాప్ హీరోయిన్స్ ని నెట్ఫ్లిక్స్ ఎంపిక చేసుకుంది. అందులో శృతి హాసన్, ఈషారెబ్బా, లక్షీమంచులు మరియు అమలాపాల్ నటించారు. దానితో పాటు జగపతి బాబు ఒక కీలకమైన పాత్ర పోషించాడు.
ఈ నలుగురు హీరోయిన్స్ సంబందించిన కథలను నలుగురు టాప్ డైరెక్టర్స్ అయిన తరుణ్ భాస్కర్, సంకల్ఫ్ రెడ్డి, నందినీ రెడ్డి, మరియు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో రోపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని ప్రేక్షకులు ఆదరిస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఒకవేళ ప్రేక్షకులు ఈ వెబ్సెరీస్ ని ఆదరించకపతే నెట్ఫ్లిక్స్ కి భారీ నష్టం మాత్రం తప్పదు.