నటి త్రిష కృష్ణన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. పదేళ్ల కాలపరిమితి తో త్రిషకు యూఏఈ ఈ లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ వీసాను జారీ చేసింది. కాగా, గోల్డెన్ వీసా అందుకున్న తొలి తమిళ నటి త్రిషనే కావడం విశేషం. “గోల్డెన్ వీసా పొందిన తొలి తమిళ యాక్టర్ కావడం ఆనందంగా ఉంది. యూఏఈ ప్రభుత్వానికి, అధికారులకు ధన్యవాదాలు” అని ఆమె ట్వీట్ చేశారు. వీసా అందుకుంటున్న ఫొటోను ఈ ట్వీట్‌కు జత చేశారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా వరించింది. అంతేకాకుండా.. ఈ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు త్రిష. సోషల్ మీడియాలో శభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ వీసాను ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్ – మమ్ముట్ట, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ చిత్ర వంటి వారు అందుకున్నారు. ఇక తమిళ చిత్రపరిశ్రమ నుంచి ఈ వీసా అందుకున్న తొలి నటి త్రిష. ఈ వీసా ఉన్నవారు సూదీర్ఘకాలం వరకు యూఏఈలో ఉండవచ్చు.
కౌమార దశలో ఉన్న పిల్లలు, యువతకు త్రిష ఐకాన్ లాంటి వారని యునిసెఫ్ కేరళ, తమిళనాడు విభాగం చీఫ్ జాబ్ జకారియా అన్నారు. చిన్నారులకు చదువు ఆవశ్యకతను తెలియజెప్పడంతో పాటు ఆరోగ్య సమస్యలపై మంచి అవగాహన కల్పిస్తున్నారని ఆమె కొనియాడారు. సమాజంలో ఆడపిల్లల ప్రాముఖ్యం ఏంటనే అంశాన్ని ఆమె అద్భుతంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 96 సినిమాతో తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది.