హైదరాబాద్ : గత నాలుగు నెలలుగా కొరోనా వైరస్ దెబ్బకి , ఇంట్లో నుండి అడుగు బయటపెట్టాలి అనుకునే ప్రతి ఒక్కరు చెప్పులు వేసుకోవడమైన మర్చిపోతారేమో కానీ ఫేస్ మాస్క్ మాత్రం ఖచ్చితంగా వేసుకుంటున్నారు. ఇదంతా కరోనా వైరస్ మనకు సోకకుండా చేస్తున్నాం కానీ ఇలా పేస్ మాస్క్ వేసుకోవడం వల్ల కుడా కొన్ని ఆరోగ్య సమ్యసలు వస్తాయ్ అంటున్నారు నిపుణులు.
పేస్ మాస్క్ వేసుకునే ప్రతి ఒక్కరు ఎదో ఒక సమయం లో నైనా చెమట, ఉపిరి ఆడకపోవడం వంటి సమస్యలు అనుభవించే ఉంటారు. ఇవి కామన్ అనుకుంటాం మనం కానీ వీటి తో పటు పేస్ మాస్క్ ఎక్కువ సేపు ధరించి ఉండటం వాళ్ళ మరికొన్ని ఇబ్బందులు తప్పవు .

ఒక మనిషి ఆరు గంటలకన్నా ఎక్కువ సమయం ఫేక్ మాస్క్ వేసుకుంటే అది ఖచ్చితంగా మన బాడీ కి అందే ఆక్సిజన్ పై ప్రభావం చూపిస్తుందని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్ చెప్పారు.
కాబట్టి ఒకవేళ మనకు N-95 మాస్క్ వేసుకోవడం వల్ల శ్వాస తీస్కువడం లో ఇబ్బందిగా ఉంటే , వైరస్ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మూడు లేయెర్స్ ఫేస్ మాస్క్ ధరించడం మంచిది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

డాక్టర్స్, నర్సులు ఇలా ఎవరైతే కరోనా వైరస్ పేషెంట్స్ కి చికిత్స అందిస్తున్నారో వాళ్లు తప్ప కరోనా వైరస్ సోకిన రోగితో సంబంధం లేని సాధారణ ప్రజలకు 3 లేయర్డ్-మాస్క్‌లలో ధరించవచ్చు అని డాక్టర్స్ సూచిస్తున్నారు.
కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాత్రం ఈ వాదనను కొట్టి పారేసింది, N-95 మరియు KN95 మాస్క్‌లు వేసుకుంటే వాటి వల్ల సాధారణ ప్రజల్లో ఆక్సిజన్ పీల్చుకోవడం పై ఎలాంటి ప్రభావం ఉండదు అని తేల్చి చెప్పింది.

ఫేస్ మాస్క్ ల ధరించడం వల్ల కలిగే నష్టాలు:
- శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది.
- ఎక్కువ సమయం పేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం దద్దుర్లు, అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది.
- ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి పై చెడు ప్రభావం చూపుతుంది.
- ముక్కు మీద మరియు చెవుల వెనుక స్కిన్ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.
- మనం వాడే పేస్ మాస్క్ పరిశుభ్రంగా లేక పొతే దాని నుండి వ్యాధులు వ్యాపిస్తాయి.
- ఎక్కువ సమయం పేస్ మాస్క్ వేసుకొని ఉండడం వల్ల చెమట పట్టడం మరియు ర్యాషెస్ ఏర్పడతాయి

పేస్ మాస్క్ వల్లే కలిగే సమస్యలకు పరిష్కారం:
- పేస్ మాస్క్ వాడడం వాళ్ళ మొటిమలు మరియు చర్మం పొడిబారకుండా ఉండటానికి చాలా నీరు త్రాగాలి.
- తాజా పండ్లు, కూరగాయలు తినాలి.
- మీ చర్మంపై దద్దుర్లు ఉంటే ఎలాంటి ఫేస్ ప్యాక్‌లు లేదా రసాయనాలను వాడకండి.
- ఒకవేళ మీరు చాల ఎక్కువ సమయం ఫేస్ మాస్క్ ధరిస్తూ ఉంటే, రాత్రి పడుకునే ముందు మీ ముఖాన్ని మంచి మాయిశ్చరైజర్‌తో మసాజ్ చేయండి.
- మాయిశ్చరైజింగ్ బాడీ సబ్బులు మరియు ఫేస్ వాష్ లు వాడండి.
- చెమట, తేమ ఉన్న ప్రాంతాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్లను వాడండి.