రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నికర ఆస్తితో భారత ప్రభుత్వాన్ని 20 రోజులపాటు నడపవచ్చు. ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల క్లబ్లో భాగమయ్యారు. ఈ జాబితాలో జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తల సరస చేరారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అతని ప్రస్తుత ఆస్తి $ 100 బిలియన్ మార్కును అధిగమించాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ ఇండియా జాబితా ప్రకారం 14వ సంవత్సరాల(2008) నుంచి భారతదేశంలో అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నారు.
అలాంటి ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ… ఒక్క రోజులో రూ. 9,415 కోట్ల విలువైన షాపింగ్ చేశారు. మనలా ఆయన ఈ షాపింగ్ చేయలేదు. గ్రీన్ ఎనర్జీలో తామూ పట్టుసాధించుకునే క్రమంలో ఒకే రోజు ఆయన ఈ స్థాయిలో షాపింగ్ చేశారు. కెమ్ చైనా అనే సంస్థకు చెందిన ఆర్ఈసీ సోలార్ అనే సబ్సిడరీ సంస్థను 771 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. భారతీయ కరెన్సీలో దీని మొత్తం రూ. 5,785 కోట్లు. సాయంత్రం… స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ సంస్థలో ప్రమోటర్ల వాటాలను కూడా కొనుగోలు చేశారు.
లిస్టెడ్ సంస్థ అయిన స్టెర్లింగ్ సంస్థలో ప్రమోటర్లకు 69.36 శాతం వాటా ఉంది. దీనిని రూ. 3,630 కోట్లకు కొనుగోలు చేశారు ముకేష్. రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ సంస్థ.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థ. ఇక ఈ రెండు లావాదేవీల తర్వాత రిలయన్స్ సంస్థ సోలార్ రెన్యూవబుల్, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈపీసీ విభాగాల్లో ప్రధాన సంస్థగా మారనుంది. చైనీస్ మ్యానుఫ్యాక్చ రింగ్ సంస్థల ఆధిపత్యమున్న ఈ రంగంలో పటిష్టమైన ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తోంది రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్.