అక్కినేని వారింటికి కోడలిగా సమంత ..నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని అనుకోని కారణాల చేత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ ఈ ఈమెను దూషించడం మొదలుపెట్టారు. సమంత సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టులు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి.. విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని నేరుగా చెప్పకుండా కొటేషన్స్, వీడియోస్ రూపంలో తన మనసులో ఉన్న భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది. సమంత ..ఎందుకు ఈ సమాజం ఎప్పుడూ ఆడ వాళ్ళని ప్రశ్నిస్తోంది.. మగవాళ్ళను మాత్రం ఎందుకు ప్రశ్నించడంలేదు.. అలాంటప్పుడు ఈ సమాజంలో ప్రాథమికంగా నైతికత అనేది లేనట్లే కదా..! అంటూ తన విడాకుల ప్రకటించిన తర్వాత తొలి పోస్ట్ పెట్టి తన పై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది.. ఉన్నట్లుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏమైనా కారణాలు ఉండొచ్చని ప్రజలు కూడా చర్చించుకోవడం గమనార్హం.
తన స్నేహితులతో ఈమె కుస్తీ పడుతూ ఒక ఫీట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి సమంత ఫిట్ గా ఉన్న వారితో పోటీ వద్దు.. అది చాలా బాధపెడుతుంది.. ఆ నొప్పిని భరించలేరు అని ట్యాగ్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్లు సమంత కేవలం ఫిట్ నెస్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట అన్నదా.. లేక తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ మాటతో జోడించిందా..అని భూతద్దం పెట్టి మరి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్లు.