TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » తెలుగు » మహాశివరాత్రి 2021 పూజా ముహూర్తం: మహాశివరాత్రి పూజా విధానం మరియు నియమాలు

మహాశివరాత్రి 2021 పూజా ముహూర్తం: మహాశివరాత్రి పూజా విధానం మరియు నియమాలు

by Bellamkonda

హిందువులకు అత్యంత పవిత్రమైన మహా శివరాత్రి ఈ సంవత్సరం మార్చి 11, 2021 పండుగ వచ్చింది. ఈ గురువారం రాత్రి శివ భక్తులు జాగారం చేస్తారు.

మహా శివరాత్రి 2021 పూజ సమయం:

మహా శివరాత్రి మార్చి 11న మధ్యాహ్నం 2.39కి చతుర్దశి తిథి నుండి మొదలై మార్చి 12న మధ్యాహ్నం 3.02కి పూర్తవుతుంది. శివరాత్రి పూజకు ప్రత్యేకమైన కాలం ఉంటుంది. ఈ శివరాత్రి పూజ నిశిత కాలం అంటే అర్థరాత్రిలో ఎక్కుమంది పూజిస్తారు. ఈ సారి మార్చ్ 11 తేదీ అర్థరాత్రి 12.06కి నుండి 12.55కి అంటే గంటలోపే శుభముహూర్తం ఉంది. శివరాత్రి పూజ ఎప్పుడైనా చెయ్యొచ్చు కానీ ఆ సమయంలో పూజిస్తే అత్యంత మహిమాన్వితమైనదని హిందువులు భావిస్తారు.

  1. ఇలా మార్చ్ 11 న పూజించడం కుదరపోతే 4 ప్రహారాల్లో పూజించ వచ్చు.
  2. ప్రహర్ 1 : మార్చి 11న సాయంత్రం 6:27 నుండి రాత్రి 09:29 PM వరకు.
  3. ప్రహర్ 2 : మార్చి 11న రాత్రి 9:29 నుండి మార్చి 12న 12:31 AM వరకు.
  4. ప్రహర్ 3 : మార్చి 12న 12:31 AM నుండి మార్చి 12న 3:32 AM వరకు.
  5. ప్రహర్ 4 : మార్చి 12న 3.32 AM నుండి మార్చి 12న 6:34 AM వరకు.

మహాశివరాత్రి పూజా విధానం పాటించవలసిన నియమాలు:

  • శివుడికి పంచామృతాలు, ఆవు పాలు, పెరుగు, నెయ్యితో, తేనే, పంచదార తో అభిషేకం చేయాలి.
  • అభిషేకాలు చేసుప్పుడు ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రం ఉచ్చరిస్తే మంచిది.
  • శివుడికి ముందుగా చందన లేపనంతో అభిషేకం ప్రారంభించాలి .
  • శివుని అభిషేకం పూర్తయ్యాక అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి.
  • ఉపవాసం చేసే వారు పండ్లు, పాలు లేదా అపహరం తీసుకోవచ్చు.
  • ఉపవాసం ఉన్నవారు శివుడి కథలు వింటూ జాగరణ చేయాలి.
  • మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇంట్లో పూజచేసుకుని దగ్గర్లో శివాలయానికి వెళ్లి అభిషేకం చేసి ఉపవాసం వదలవచ్చు.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More