Home » తెలుగు » పట్ట పగలే హైదరాబాద్ ఏటీఎం వద్ద కాల్పులు, సినిమా స్టైల్ లో చోరీ

పట్ట పగలే హైదరాబాద్ ఏటీఎం వద్ద కాల్పులు, సినిమా స్టైల్ లో చోరీ

by Bellamkonda

హైదరాబాద్: పట్టపగలు జనాలు తిరుగుతుండగానే హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పటేల్ కుంట పార్క్ సమీపంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం వద్ద ఈ రోజు ఏప్రిల్ 29న, గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి డబ్బులతో పరారయ్యారు. ఈ ఘటనలో ఒక బ్యాంకు ఉద్యోగి మరియు సెక్యూరిటీ గార్డ్ గాయపడ్డారు.

రోజులాగే సెక్యూరిటీ గార్డుతో కలిసి ఒక ఉద్యోగి డబ్బు ఏటీఎంలో నింపుతుండగా , గుర్తు తెలియని వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి 5 లక్షల డబ్బుతో పారిపోయారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డుతో పాటు బ్యాంకు ఉద్యోగి గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సినిమా స్టైల్ లో జరిగిన ఈ దొంగతనాన్ని త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు వెల్లడించారు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

You cannot copy content of this page