మేష రాశి
ముఖ్యమైన వ్యవహారాల్లో వాయిదా పడినా చివరికి అనుకున్న పని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని దాటుకెల్తారు. ఈ రోజు మేష రాశి వారు వీలైనంతవరకు కోపతాపాతాలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి అలాగే మానసికంగా చాల దృఢంగా ఉండాలి. ఆలోచనలు కలిసిరాకపోవొచ్చు ఆలయాలు, ఆశ్రమాలు సందర్శించే అవసరాలు కలుగుతూ ఉంటాయి. ఈ రోజు వీళ్లు హనుమాన్ చాలీసా పాటిస్తే మంచిది.

వృషభ రాశి
వృషభ రాసి వారికి ఈ రోజు ఊహించని లాభాలు కలిసి వస్తాయి, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది, అన్ని శుభాలు కలుగుతాయి. దూరప్రయాణాలు లాభిస్తాయి. అభివృద్ధి కోసం కష్టపడే వారి శ్రమ ఫలిస్తుంది. వీరు ఈ రోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. పలుకుబడి మరింత పరుగుతూ ఉంటుంది. వ్యాపార వ్యహారాల్లో అనుకూలత ఉంటుంది. ఈ రోజు వీళ్లు దక్షిణా మూర్తి స్తోత్రం పారాయణం చేస్తే మంచిది.

మిథున రాశి
మిథున రాశివారు ఈ రోజు అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతూ ఉంటాయి. తీసుకున్న నిర్ణయాలు వాయిదా వేస్తూ ఉంటారు , శ్రమ పెరుగుతుంది. బంధువులతో మాట పట్టింపులు పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం గణపతి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడా ఉత్తమం.

కర్కాటక రాశి
నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి, ముఖ్యమైన ఆహ్వానాలు అందుతుంటాయి. శుభా కార్యక్రమాల్లో పాల్గొంటారు, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈ రోజు వీళ్లు హేరంబ గణపతిని పూజిస్తే మంచిది.

సింహ రాశి
పనుల్లో విజయాలు కలిసి వస్తాయి, శుభా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోద పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళకరమైన వార్తలు వింటారు. మంగళప్రదమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చే ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహ రాశి వారు పసుపు గణపతికి అర్చన చేస్తే మంచిది.

కన్యా రాశి
ఈ రోజు చేపట్టిన పనిలో సాదారణ ఫలితాలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగ విషయాల్లో కూడా సాదారణ ఫలితాలు ఉంటాయి. వీలైనంత వరకు కోపతాపాలకు దూరంగా ఉండండి. చేసే పన్నుల్లో శ్రమ పెరుగుతుంది, ఉద్యోగాల్లో సాదారణ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు వీళ్లు సరస్వతి స్తోత్రం తో పాటు విద్య గణపతికి అర్చన చేస్తే మంచిది.

తులా రాశి
తుల రాశి వారు చేపట్టిన పనులు వాయిదా పడుతూ ఉంటాయి, సామజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు . షేర్ లు పెట్టుబడుల విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో ఆగిపోయిన పనులను ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహం లభిస్తుంది. ఈ రోజు శుభఫలితాలు కోసం ఆంజనేయ స్వామి దండకం పారాయణం చేయడం మంచిది.

వృశ్చిక రాశి
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడతాయి, సాంగ పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు ఆభరణాలు సేకరిస్తూ ఉంటారు. ఈ రోజు మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది అలాగే వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు వృశ్చిక రాశి వారు ఎలుకు వాహనం ని పూజ చేస్కోవడం మంచిది.

ధనస్సు రాశి.
ఈ రోజు ధనస్సు రాశి వారికి దూరప్రాంతం నుండి వచ్చిన ఆహ్వానం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరమైన అభివృద్ధి పెరుగుతుంది, ఆటంకాలు తొలగిపోతాయి. వస్తువులు కొనుగోలు చేస్తారు. రావాల్సిన బాకీలు విషయంలో అజాగ్రత్తగా వ్యహరిస్తుంటారు. ఈ రోజు వీళ్లు దుర్గ దేవిని ఆరాధిస్తే మంచిది.

మకర రాశి
మకర రాశి వారికి ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి, సామాజికి గౌరవాలు పెరుగుతాయి. అలాగే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, దాన్ని బట్టి కొన్ని కార్యక్రమాల్లో మార్పులు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో విభేదాలు పెరుగుతాయి, ఆలయాలు సందర్శిస్తారు. ఈ రోజు మకర రాశి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మంచిది.

కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారికీ కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది, కొన్ని పనులు వాయిదా వేస్తూ ఉంటారు. బాకీలు వసూలు చేసుకుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వీరికి ఈ రోజు ఆస్తి వివాదాలు పరిష్కారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మొత్తం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు వీళ్లు దుర్గా సప్తశ్లోకి పారాయణం చేస్తే మంచిది.

మీన రాశి
మీన రాశి వారికీ ఈ రోజు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోద పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దవారి నుండి సలహాలు తీసుకుంటారు. ఈ రోజు వీళ్లు “శ్రీ రాజమాతంగే నమః “అనే మంత్రాన్ని పఠిస్తే మంచిది.
