TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » తెలుగు » బంగారం రేటు మళ్ళీ ఘాటు గురూ!..

బంగారం రేటు మళ్ళీ ఘాటు గురూ!..

by Murthy

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెట్టింది ఔన్స్‌కు 0.08 శాతం పైకి కదిలింది. గత మూడు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పైకి కదిలింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగింది.

దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1760 డాలర్లకు ఎగసింది. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 0.26 శాతం పెరుగుదలతో 22.57 డాలర్లకు చేరింది. గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. 

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పైకి కదిలింది. దీంతో బంగారం Gold ధర రూ.48,160కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.250 పెరుగుదలతో రూ.44,150కు ఎగసింది.

ఇకపోతే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను GST (జీఎస్‌టీ), ఇతర పన్నుల, తయారీ చార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి. 

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More