దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు భారంగా మారుతోంది. దేశంలో చమురు ధరలు కొండలా పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. . పెట్రో, డీజిల్ ధరలు దిగొస్తే ఆటో ఛార్జీలతోపాటు..నిత్యావసర వస్తువుల ధరలు దిగివస్తాయని ప్రజలు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నారు.ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశన్నంటగా ఆటో ఛార్జీలు కూడా చుక్కలు చూపిస్తు న్నాయి. అక్టోబర్ నెలలో 18 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటివరకు అక్టోబర్ నెలలో 6 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరగగా.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 107.24, డీజిల్ రూ. 95.97 పెరిగింది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.111.55, డీజిల్ రూ.104.70గా ఉంది. చమురు రేట్లు భయపెడుతున్నాయి. ఎప్పటికప్పుడు పెరుగుతున్న చమురు భారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను తీవ్రంగా కలవరపెడుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వ్యయంలో డీజిల్ వాటా ఏకంగా 30 శాతాన్ని మించింది. రెండేళ్ల స్వల్ప విరామంలోనే లీటరు డీజిల్‌పై 24 మేర ధర పెరగటంతో ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిస్థితి గందరగోళంగా మారింది. సంస్థ తాజా లెక్కల ప్రకారం.. ఒక కిలోమీటరుకు వ్యయం 60 రూపాయలుగా ఉండగా, అందులో డీజిల్ వాటా 21కి చేరింది. ఉద్యోగుల జీతాల ఖర్చు 53 శాతం ఉండగా, ఇప్పుడు డీజిల్ భారం 30 శాతాన్ని మించటంతో ఈ రెంటినీ ఎలా తగ్గించుకోవాలనే విషయంపై ఆర్టీసీ మేధోమధనం ప్రారంభించింది.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.113.12, డీజిల్ రూ.104కి వచ్చింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.104.22, డీజిల్ రూ.100.25గా ఉంది. కోల్‌కత్తాలో లీటర్ పెట్రోల్ రూ.107.78, డీజిల్ రూ.99.08కి చేరుకుంది. దేశంలో 12 రాష్ట్రాల్లో 100 దాటింది లీటర్ డీజిల్ ధర. కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లేహ్‌లో డీజిల్ ధర 100 దాటేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో భారత్‌లో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.