ఆకాశం నీ హద్దు రా సినిమాతో తెలుగు లో ఒక మంచి సూపర్ హిట్ అందుకున్న సూర్య ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు తెలుగు లో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. సూర్య ఎప్పటి నుండో తెలుగు లో ఒక మంచి సినిమా తీయాలని బావిస్తున్నప్పటకి ఒక సరైన కథ కోసం వేచిచూస్తున్నారు.
అలాగే మరోవైపు దిల్ రాజు ఎన్నో క్రేజీ కంబినేషన్స్ కి శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ఉన్నారు, అందులో భాగంగానే బోయపాటి దర్శకత్వం లో సూర్య ని హీరో గా పెట్టి ఒక సినిమా తియ్యాలని నిర్ణయించిన్నట్టు సినీ వర్గాల నుండి సమాచారం. మొదట్లో బోయపాటి ప్రభాస్ కోసం సినిమా స్క్రిప్ట్ రాసినప్పటికీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు అదే స్క్రిప్ట్ కి సూర్య ని హీరో పెట్టి సినిమా తియ్యాలని దిల్ రాజు బోయపాటి నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే సూర్య బోయపాటి సినిమా అంటే ఎంత మాస్ గా ఉంటుందో అని ప్రేక్షకుల్లో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.
సూర్య ప్రయోగాత్మక చిత్రాలు తీయడం లో ఎప్పుడు ముందు ఉంటారు బహుశా అందుకే బోయపాటి సినిమాకి ఓకే చెప్పరేమో. అయితే ప్రస్తుతానికి బోయపాటి తో సినిమా షూటింగ్ పనుల్లో బిజీ గా ఉన్నాడు , ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సూర్య తో సినిమా మొదలు పెట్టె అవకాశం ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్స్ సెక్షన్ లో తెలియజేయండి.