రష్యాలోని ఫేమస్ బోల్సోయ్ ధియేటర్లో ఓ స్టేజీ మీద ఓ నాటకం సాగుతోంది. ఈ నాటకం చూసేందుకు చాలా మంది వచ్చారు. ఓ సీన్ అయిపోయిన తర్వాత నెక్ట్స్ సీన్ కోసం అందులో ఉండే నటులు స్టేజీ వెనుక కొన్ని మార్పులు చేస్తున్నారు. స్టేజీ మీద బ్యాక్ గ్రౌండ్ మార్చే క్రమంలో 38 సంవత్సరాల కుల్లేష్ అనే నటుడు వారికి సాయం చేస్తున్నాడు. అయితే, ఆ సమయంలో ఇనుప గేటు లాంటిదాని కింద తను పడిపోయాడు. ధియేటర్లో కూర్చుని చూస్తున్న జనం అంతా కూడా ఇదేదో నాటకంలో భాగం అనుకున్నారు. అయితే, అతడు దాని కింద పడిపోయిన విషయాన్ని గమనించిన స్టేజీ మీద వ్యక్తులు వెంటనే పెద్దగా అరవడంతో స్టేజీ తెరలు మూసేశారు. ధియేటర్ మేనేజ్మెంట్ వెంటనే ఆంబులెన్స్ తీసుకొచ్చి అతడిని ఆస్పత్రికి తరలించింది.
తను అప్పటికే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. అతడు కింద పడి అరుస్తుంటే జనం అదేదో కామెడీ అనుకున్నారు ప్రేక్షకులు . ప్రేక్షకులకు అప్పుడు అర్థమైంది..తను నిజంగానే అరుస్తున్నాడని..భయంతో బయటకి పరుగులు తీశారు. ఘటన జరిగిన వెంటనే ధియేటర్ యాజమాన్యం అలర్ట్ ప్రకటించింది. అందరూ జాగ్రత్తగా బయటకు వెళ్లాలని సూచించింది.
బోల్సోయ్ విషాదానికి కొత్తేమీ కాదు. 2013 లో థియేటర్ యొక్క ఆర్టిస్టిక్ డైరెక్టర్‌పై యాసిడ్ దాడికి పాల్పడినందుకు ఒక మాజీ డ్యాన్సర్‌కు పెనాల్టీ కాలనీలో ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అదే సంవత్సరం, ఒక ప్రముఖ వయోలినిస్ట్ పిట్లో పడి మరణించాడు.