పండుగ సీజన్ స్టార్ట్ అవుతోంది. పండగ సీజన్ వస్తున్న తరుణంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వినియోగదారులకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నాయి. దీనితో చాలా కంపెనీలు కస్టమర్స్ కోసం ఆఫర్స్ ని ప్రకటించాయి. వీటిని వినియోగించుకుని కస్టమర్స్ డబ్బులుని ఆదా చేసుకోచ్చు. మనం రోజు చాలా ఆఫర్లు చూస్తుంటాం. ఆఫర్ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. ఆఫర్ అనే మాట వింటే అటే వెళ్లిపోతుంది మనస్సంతా. అలా మనం చాలారకాల ఆఫర్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం..కొంటుంటాం. ఇందులో భాగంగా ఎయిర్టెల్ తమ కస్టమర్స్ కోసం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ లో భాగంగా రూ.12 వేలలోపు ధరలో ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
శాంసంగ్, షావోమి, వివో, ఒప్పొ, రియల్‌మి, నోకియా, ఐటెల్, లావా, ఇన్ఫినిక్స్, టెక్నో, లెనొవొ, మోటరోలా వంటి ఫోన్లు వున్నాయి. వీటిలో ఏదైనా ఫోన్ ని కస్టమర్స్ కొనాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఫోన్ కొనుగోలు చేసిన వాళ్లకి రూ.6 వేల క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే ఫోన్ ని కొనుగోలు చేసిన వారు 36 నెలల పాటు వారి ఎయిర్టెల్ నెంబర్‌ను రూ.249 లేదా ఆపైన రీచార్జ్ ప్లాన్లతో ఫోన్ రీచార్జ్ చేసుకోవాలి. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ ఆఫర్ ని తీసుకు రావడం జరిగింది. ఇలా చేస్తే కస్టమర్లకు రెండు విడతల్లో క్యాష్‌బ్యాక్ వస్తుంది. 18 నెలల తర్వాత రూ.2 వేల క్యాష్‌బ్యాక్ వస్తుంది. మిగతా రూ.4 వేల క్యాష్‌బ్యాక్ 36 నెలల తర్వాత చెల్లిస్తారు. అదే విధంగా ఆఫర్లో భాగంగా ఫోన్ కొన్న వారికి ఒకసారి స్క్రీన్ రిప్లేస్మెంట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. 90 రోజుల్లోగా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ కొనుగోలుదారులకు దీపావళి సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్స్, టీవీల కొనుగోలుపై భారీ డీల్స్‌ను, ఆఫర్లను కొనుగోలుదారులకు అందుబాటులో తీసుకవచ్చింది. వన్‌ప్లస్ తన అధికారిక వెబ్సైట్లో దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది. వన్‌ప్లస్ 9 ప్రో , వన్‌ప్లస్ 9 ఆర్తో సహా , వన్‌ప్లస్ 9 శ్రేణిపై భారీ తగ్గింపును అందిస్తోంది. అదనంగా, వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌పై కూడా డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ప్రకటించింది. తొమ్మిది నెలల వరకు నోకాస్ట్ ఈఎమ్ఐ సదుపాయాన్ని కూడా వన్‌ప్లస్ అందించనుంది.