ఎగసిపడుతున్న సముద్ర కెరటాలు నెమ్మదినెమ్మదిగా భూగోళాన్ని కబళిస్తున్నాయి. భూ వాతావణం వేడెక్కేకొద్దీ ఏటికేడు సముద్ర మట్టం పెరిగిపోతూ తీర ప్రాంతాలకు ముప్పు ముంచుకొస్తున్నది. 1901 నుండి ఇప్పటివరకూ దాదాపు 20 సెంటీమీటర్ల మేర సముద్ర నీటిమట్టం పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతే కాదు నీటిమట్టం పెరుగుదల ఇటీవల బాగా పెరిగిందని కూడా హెచ్చరిస్తున్నారు. ఎగసిపడుతున్న సముద్ర కెరటాలు నెమ్మదినెమ్మదిగా భూగోళాన్ని కబళిస్తున్నాయి. భూ వాతావణం వేడెక్కేకొద్దీ ఏటికేడు సముద్ర మట్టం పెరిగిపోతూ తీర ప్రాంతాలకు ముప్పు ముంచుకొస్తున్నది. 1901 నుండి ఇప్పటివరకూ దాదాపు 20 సెంటీమీటర్ల మేర సముద్ర నీటిమట్టం పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతే కాదు నీటిమట్టం పెరుగుదల ఇటీవల బాగా పెరిగిందని కూడా హెచ్చరిస్తున్నారు.
ఏటేటా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వాతావరణ మార్పలు కారణంగా అయితే భారీ వర్షాలు లేకపోతే కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వర్షాలు, తుఫానుల కారణంగా ప్రపంచంలోని పలు నగరాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువాల వద్ద మంచు క్రమంగా కరుగుతోంది. దీంతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఇండియాలోని పలు తీర ప్రాంత నగరాలు మునిగిపోయే అవకాశం ఏర్పడుతుందని నాసా సంచలన విషయాలను బయటపెట్టింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజెస్( ఐపీసీసీ) అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.