కొన్ని రోజుల క్రితం తమ పాలసీలను వియోలేట్ చేసినందుకు గూగుల్ పేటీయం ని తన యాప్ స్టోర్ నుండి తొలిగించింది. మళ్లీ వెంటనే పేటీయం గూగుల్ తో చర్చలు జరిపి యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ యాడ్ చేసింది. కానీ గూగుల్ అలా పేటీయం యాప్ ని తొలగించిన కొద్దీ రోజులకే పేటీయం ఇప్పుడు ఏకంగా తనకంటూ ఒక కొత్త యాప్ స్టోర్ ని లాంచ్ చేసి గూగుల్ కి దిమ్మితిరిగే షాక్ ఇచ్చింది.
పేటీయం మినీ యాప్ స్టోర్‌ను అక్టోబర్ 5 న లాంచ్ చేసింది. గూగుల్ రీసెంట్ గా ఒక ప్రకటన చేసింది ఆ ప్రాక్తనము ప్రకారం తన ప్లేస్టోర్‌లో ఏ యాప్స్ అయితే తమ బిల్లింగ్ సిస్టంను ఉపయోగించవో వాటికి 30 శాతం ఫీజుల విధించనున్నట్లు ప్రకటించింది. దీంతో భారతీయ యాప్ డెవలపర్లు, వ్యాపారులు గూగుల్ ప్లేకు ప్రత్యామ్నాయంగా భారతీయ యాప్ స్టోర్ ఉండాలని డిమాండ్ చేశారు.
అలా కోరిన కొన్ని రోజులకే పేటీయం తన మినీ ప్లే స్టోర్ లాంచ్ చేయడం గొప్ప విశేషం అని చెప్పొచ్చు. అయితే ఈ ప్లే స్టోర్ లో ప్రస్తుతానికి కొన్ని యాప్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో 300 సేవలను అందించనున్నట్లు పేటీయం కంపెనీ ప్రకటించింది.
గూగుల్ ప్లే స్టోర్ కి పేటీయం ప్లే స్టోర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పేటీయం నేరుగా యాప్స్ అందించే పని లేకుండా, పేటీయం ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్(పీడబ్ల్యూఏ)కు సంబంధించిన లింకులను అందిస్తుంది.
ఈ ప్లే స్టోర్ ని చిన్న డెవలపర్లకు, వ్యాపారులకు సాయం చేయడం కోసం లాంచ్ చేసినట్టు పేటీయం ప్రకటించింది.
ఇందులో విశేషం ఏంటంటే తక్కువ ఖర్చుతో, సులభంగా రూపొందించిన యాప్స్‌ను పేటీయం ఇందులో అందించింది. యూసర్ ఫ్రెండ్లీ గా ఉండే ఈ యాప్ స్టోర్ లో ఉన్న లిస్టింగులన్నీ ఉచితమేనని పేటీయం ప్రకటించింది.
పేటీయం మినీ స్టోర్ డెవలపర్లకు పేటీయం వాలెట్ , పేటీయం ప్రెమెంట్స్ బాన్ మరియు UPI తో సహా ఉచిత పేమెంట్ సౌకర్యాలను అందిస్తుంది. అయితే, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ట్రాన్సక్షన్స్ చేస్తే మాత్రం 2 శతం అదనపు ఛార్జీ లు చెల్లించాలి.
పేటీయం మినీయాప్ స్టోర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ఏక్యూఐ మానిటర్, ఈఎంఐ కాలిక్యులేటర్, మోజో పిజ్జా, హోరో స్కోప్, స్పీడ్ టెస్ట్, యూనిట్ కన్వర్టర్ వంటి యాప్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో మిగతా యాప్స్ కూడా పేటీయం ప్లే స్టోర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది.