ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ పేరు మారింది. ఇదే విషయాన్ని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ స్వయంగా వెల్లడించారు. ఫేస్బుక్ కంపెనీ పేరును మెటా గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై కంపెనీ స్టాక్స్ అన్నీ కొత్త సింబల్ MVRS తో ట్రేడ్ అవుతాయని తెలిపారు. MVRS అంటే మెటా వర్స్(metaverse). మెటా వర్స్ అంటే ప్రజలు కలుసుకునే వర్చువల్ రియాలిటీ స్పేస్ అని అర్థం. దీనికి సంబంధించిన కొత్తలోగోను గురువారం కంపెనీ కనెక్ట్ ఈవెంట్లో ఆవిష్కరించారు. ప్రైవసీ, సేవల్లో అంతరాయాలు వంటి అంశాలపై ఫేస్బుక్ తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంపెనీపై వస్తున్న ఆరోపణలు, కంపెనీ ఎదుర్కొంటున్న వివాదాలపై ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని టెక్ విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుత బ్రాండ్ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలోనే మన సంస్థ బ్రాండ్ పేరు మారింది. ‘మెటావర్స్’లో భాగంగా పేరు మార్పు నిర్ణయం తీసుకున్నాం. వర్చువల్-రియాలిటీ స్పేస్లో రానున్న కాలంలో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని అత్యున్నత స్థాయి సాంకేతిక సేవలను వినియోగం, సంబంధిత అంశాలు ‘మెటావర్స్’ పరిధిలోకి వస్తాయి.’’ అని మార్క్ జూకర్ బర్గ్ పేర్కొన్నారు.