1999లో జపాన్‌కు చెందిన కళాకారుడు షిగేటక కురీత మొట్టమొదటిసారిగా ఎమోజీని ఆవిష్కరించాడు. అప్పట్లో జపనీస్ మొబైల్ కంపెనీ డొకొమో, మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా పంపే సందేశాలకు 250 క్యారెక్టర్ల పరిమితి విధించింది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఎమోజీలను అతడు సృష్టించాడు. భిన్న ప్రాంతాలు, సంస్కృతులు ఉన్న ప్రజలకు ఆమోదయోగ్యం ఆదరణపాత్రంగా ఉండేలా ఎమోజీల రూపకల్పనలో శ్రద్ధ తీసుకుంటారు. షిగేటక సృష్టించిన 176 ఎమోజీలను మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో శాశ్వత కలెక్షన్గా భద్రపరిచారు. టెక్ట్స్ సందేశాలపై ఇప్పుడు పరిమితి లేకున్నా పదాల్లో వ్యక్తం చేయలేని భావాలను చేరవేసేందుకు ఎమోజీలు ఉపకరిస్తున్నాయి. ఈ ఏడాది 37 కొత్త ఎమోజీలను ఆమోదించింది. వచ్చే ఏడాది నుంచి ఇవి నెటిజన్లకు అందుబాటులోకి వస్తాయి. కొత్తగా చేరనున్న ఈ ఎమోజీల్లో మెల్టింగ్ ఫేస్ (కరుగుతున్న ముఖం) ఎమోజీకి సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. జెన్నిఫర్ డేనియల్, నీల్కాన్లు దీనికి రూపం ఇచ్చారు.
ప్రపంచ కాలమాన పరిస్థితులకు దీటుగా భావాలను వ్యక్తం చేయడానికి ఏటికేడాది కొత్త ఎమోజీలను రూపొందించి వినియోగంలోకి తెస్తున్నారు. ఒకరకంగా మనసులోని భావాలను, అనుభూతులను, ఆందోళనలను, ఉద్వేగాలను పట్టి చూపే అంతర్జాతీయ దృశ్యభాష ఇది. విస్తృతంగా సర్వేలు చేసి, అభిప్రాయాలు క్రోడీకరించుకుని ఎమోజీలను తయారు చేస్తున్నారు. డిజిటల్ టెక్ట్స్‌కు ప్రమాణాలను నిర్దేశించే యూనికోడ్ కన్సార్టియం ఈ ఏడాది 37 కొత్త ఎమోజీలను ఆమోదించింది. వచ్చే ఏడాది నుంచి ఇవి నెటిజన్లకు అందుబాటులోకి వస్తాయి. కొత్తగా చేరనున్న ఈ ఎమోజీల్లో మెల్టింగ్ ఫేస్ (కరుగుతున్న ముఖం) ఎమోజీకి సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. జెన్నిఫర్ డేనియల్, నీల్కాన్లు దీనికి రూపం ఇచ్చారు.