టెక్ దిగ్గజం యాపిల్‌కు చైనా విద్యార్థులు భారీ షాకిచ్చారు. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌తో ఛార్జర్ ఇవ్వనందుకుగాను కంపెనీపై దావా వేసినట్లుగా తెలుస్తోంది. మ్యాగ్‌సేఫ్ వైర్లెస్ ఛార్జర్లను ప్రోత్సహించడం కోసం కర్బన్ వెస్ట్ రిడక్షన్ పాలసీను ఒక సాకుగా చూపిస్తోందని విద్యార్థులు పేర్కొన్నారు. తమకు వెంటనే యాపిల్ ఛార్జర్లను సరఫరా చేయాలని అదే విధంగా 100 యువాన్లు నష్టపరిహరాన్ని అందించాలని విద్యార్ధులు దావాలో తెలిపారు. కాగా స్మార్ట్‌ఫోన్ చైనీస్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై అడాప్టర్ అప్షన్‌ను ఇస్తున్నట్లు కోర్టుకు విద్యార్థులు విన్నవించారు
ఐఫోన్ 12 ప్రో మాక్స్‌తో ఛార్జర్‌ను చేర్చనందుకు చైనాలోని విశ్వవిద్యాలయ విద్యార్థుల బృందం ఆపిల్‌పై దావా వేసింది. MagSafe వైర్లెస్ ఛార్జర్లను ప్రోత్సహించడానికి Apple దీన్ని ఒక సాకుగా మాత్రమే ఉపయోగిస్తోందని విద్యార్థులు వాదించారు. క్లెయిమ్ చేసారు, ఐఫోన్ కొనుగోలుపై కంపెనీ ఇచ్చిన యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ కేబుల్ ఇతర ఛార్జర్లకు అనుకూలంగా లేదంటూ విద్యార్థులు తమ దావాలో వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఛార్జింగ్ కేబుల్ ఇతర ఛార్జర్లకు సపోర్ట్ ఇస్తూందనే కంపెనీ చెప్పిన విషయాన్ని దావాలో గుర్తుచేశారు.