ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఏ కొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చిన అది చాలా యూనిక్‌గా ఉంటుంది. ధర కూడా అదే రేంజ్లో ఉంటుంది. అయితే, ఆపిల్ లాంచ్ ఈవెంట్లో తన కొత్త మాక్ బుక్ ప్రోస్, ఎమ్1 ప్రో, మ్యాక్స్ చిప్స్, మూడవ తరం ఎయిర్ పాడ్స్‌తో పాటు అదనంగా ఈవెంట్ తర్వాత ఒక పాలిషింగ్ వస్త్రాన్ని విడుదల చేసింది. ఈ వస్త్రంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను క్లీన్ చేసుకోవచ్చు. నాన్ రాపిడి మెటీరియల్స్‌తో తయారు చేసిన ఈ ఆపిల్ బ్రాండెడ్ క్లాత్ విడిగా పోర్టల్‌లో కొనుక్కోవచ్చు.
దీనిపై ఆపిల్ లోగో స్టాంప్ కూడా ఉంది. సాధారణ మైక్రోఫైబర్ వస్త్రం కంటే ఇది ఏ విధంగా భిన్నం అనేది వాడే వారికి మాత్రమే తెలుస్తుంది. ఆపిల్ ఉత్పత్తులను శుభ్రం చేసేటప్పుడు “మృదువైన లింట్-ఫ్రీ క్లాత్” ఉపయోగించాలని “రాపిడి బట్టలు, టవల్స్, పేపర్ టవల్స్ లేదా ఇలాంటి వస్తువులను” వాడుకూడదని ఆపిల్ సిఫార్సు చేస్తుంది. ఈ ఆపిల్ పాలిషింగ్ క్లాత్ ధర మన దేశంలో రూ.1900లుగా ఉంది.
ఎలక్ట్రానిక్ పరికరాలు వాడినప్పుడు వాటి డిస్ ప్లే పై దుమ్ము, ధూళి చేరుతుంది. మరకలు పడతాయి. ఇది కామన్. ఈ కారణంగా వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం అవసరం. మరి, వాటిని శుభ్రం చేసేందుదు ఏ ఉత్పత్తులు వాడాలి? వాటిని ఎలా సరిగ్గా చూసుకోవాలి? అనే దాని గురించి చాలా మందికి సరైన ఐడియా లేదు. ఈ విషయంలో ఆపిల్ ప్రత్యేక శ్రద్ధ చూపింది. గాడ్జెట్ల డిస్ ప్లేను శుభ్రపరిచే ప్రత్యేక వస్త్రాన్ని మార్కెట్ లోకి తెచ్చింది. ఐఫోన్ 6, ఐఫోన్ ఎస్ ఈ రెండు జనరేషన్స్ ని ఈ నేప్కిన్తో శుభ్రం చేయవచ్చు. iPhone 6, iPhone 6 Plus మరియు iPhone SE లను శుభ్రం చేసుకోవచ్చు. ఐఫోన్ 5 ఎస్ వంటి పాత స్మార్ట్ఫోన్లు, యాక్సెసరీలకు ఈ క్లాత్ తగినది కాదు.