రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మనకు ఎంత మంచి చేస్తుందో అంతకంటే ఏక్కువ చెడు కూడా చేస్తుంది. మనం ఇప్పుడు 4జి నుండి 5 జి నెట్వర్క్ మొబైల్ ఫోన్లు నెట్‌వర్క్‌లు వాడేస్తున్నాం, దీన్ని వల్ల ఆరోగ్యానికి హాని తప్పదు అని కొంత మంది రెసెర్చ్ర్స్ గట్టిగా వాదిస్తున్నారు.
ఇప్పటికే ఈ 5జి నెట్వర్క్ విదేశాలు పూర్తిగా ఉపయోగిస్తున్నారు కానీ ఇండియా లో మాత్రం ఇంకా అందరికి అందుబాటులోకి రాలేదు. 5 జి నెట్వర్క్ వల్ల ఆరోగ్యనైకి పర్యావరణానికి నష్టం తప్పదు అంటున్నా…, టెక్నాలజీ కంపెనీలు మాత్రం అవేవి పట్టనట్టు 5జి నెట్వర్క్ తమ ఫోన్లలో డివైసెస్ లో అందుబాటులో ఉంచకపోతే మార్కెట్ లో ఎక్కడ వెనకబడిపోతామో అని భయంతో తమ అన్ని డివైసెస్ 5 జి టెక్నాలజి ని సపోర్ట్ చేసే విధంగా ఇప్పటికి మార్పులు చేస్తున్నాయి.

హెల్త్ కి రిస్క్ ఉంది అని తెలిసిన ఈ 5 జి నెట్వర్క్ ని యూసర్స్ కుడా ఎక్కువగా వాడేందుకే ఇష్టపడుతున్నారు, దానికి కారణం ఈ నెట్వర్క్ హై స్పీడ్ సర్వీసెస్, వాహనాలకు ల్ఫ్-డ్రైవింగ్ సిస్టం, వర్చువల్ రియాలిటీ ఇలా ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కి 5జి నెట్వర్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
అయితే అడ్వాన్స్డ్ సర్వీసెస్ అందించడానికి 5 జి నెట్వర్క్ కి ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ గానే ఉపయోగిస్తుంది. కాబట్టి ఇప్పుడు 5G సిగ్నళ్లు అందుకోవడానికి ఎక్కువ సామర్థం ఉండే యాంటెనాలు వాడాల్సి ఉంటుంది.
ఇప్పటికే సెల్‌ఫోన్ సిగ్నల్స్ కోసం మొబైల్ కంపెనీస్ ఎక్కడపడితే అక్కడ యాంటెనాలు ఏర్పాటు చేసారు, ఇప్పుడు 5 జి నెట్వర్క్ కోసం మరిన్ని టెనాలను ఏర్పాటు చేయాలి. ఎక్కువ యాంటెనాలను పెట్టడం వల్ల ప్రజలు రేడియో తరంగాలకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.
ఈ రేడియో తరంగాలకు మనిషి ఎక్కువ గా గురయ్యేవారికి, మొబైల్ ఫోన్లను అతిగా ఉపయోగించేవారికీ అలాగే ఫోన్లు తలకు దగ్గరగా ఎక్కువ సేపు పెట్టుకునే వారికీ క్యాన్సర్ సోకే అవకాశం ఉందని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైసేషన్ తెలిపింది.
ఈ హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించి తయారుచేసిన బొమ్మలు పిల్లల మానసిక సామర్థ్యంపై ప్రభావం చూపుతాయని రెసెర్స్ర్స్ చెప్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వారికు ఇలాంటి పరికరాలు, ఫోన్లకు పిల్లలకు దూరంగా ఉంచాలని ఫ్రాన్స్‌కు చెందిన ANSES సేఫ్టీ ఏజెన్సీ సూచించింది.
రేడియో తరంగాలు ఎక్కువ గురైన మనుషులయూ నిద్రలేకపోవడం , ఒత్తిడి వంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని పరిశోదల్లో తేలినట్లు ANSES సంస్థకు చెందిన నిపుణులు చెప్తున్నారు.