TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Sports » కోహ్లీ కుమార్తెకు రేప్​ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి అరెస్ట్!..

కోహ్లీ కుమార్తెకు రేప్​ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి అరెస్ట్!..

by Murthy

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క, కూతు​రు వామికలపై కొందరు నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేశారు. కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ సహా వారి కూతురు వామికను కూడా ఇందులోకి లాగుతున్నారు. చిన్నారి ఫొటోను విడుదల చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడతామంటూ హేయమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్​లో జట్టు వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెటర్లపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ కూతురు ఫొటో విడుదల చేయాలని.. ఆమెపై అత్యాచారానికి పాల్పడతామంటూ పలువురు హేయమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కేసును సుమోటోగా తీసుకుంది దిల్లీ మహిళా కమీషన్. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్​ను నవంబరు 8లోగా సమర్పించాలని పోలీసులను కోరింది.

పాకిస్థాన్​, చేతిలో ఓటమిని సహించలేని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో టీమ్​ఇండియా క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్​కు పాల్పడ్డారు. ప్రధానంగా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ పేసర్ మహ్మద్​ షమీలను టార్గెట్ చేశారు. మత విద్వేషాన్ని ఎదుర్కొంటున్న షమీకి కోహ్లీ అండగా నిలవడంతో కోహ్లీపై విరుచుకుపడ్డారు. మానవత్వాన్ని మంటగలిపేలా, అన్ని హద్దులూ దాటుతూ అభం శుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో పలువురు సామాజిక వేత్తలు మండిపడుతున్నారు. ఇటీవలి కాలంలో క్రికెటర్లపై కొందరు ఉన్మాదులు అసభ్యకరంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే, గతంలో కూడా ఇలాంటి పరిస్థితిని ధోనీ కూడా ఎదుర్కొన్నాడు. గెలుపు, ఓటములు ఆటలో భాగమైనప్పటికీ… క్రికెటర్ల కుటుంబ సభ్యులపై కొందరు విపరీత వ్యాఖ్యలు చేస్తుండటాన్ని అందరూ ఖండిస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.  కామెంట్లు చేసిన వారిలో ఒకరైన హైదరాబాద్‌కు చెందిన రాంనాగేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More