TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Sports » మ్యాచ్ నుంచి తప్పుకున్నందుకు డికాక్​ క్షమాపణలు!..

మ్యాచ్ నుంచి తప్పుకున్నందుకు డికాక్​ క్షమాపణలు!..

by Murthy

టీ20 ప్రపంచకప్​లో భాగంగా మంగళవారం వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​ నుంచి అనూహ్యంగా తప్పుకొన్నాడు దక్షిణాఫ్రికా కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ కీలక మ్యాచ్​కు కొద్ది సమయం ముందే తాను వైదొలుగుతున్నట్లు తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్​ ఆడట్లేదని మేనేజ్​మెంట్​కు స్పష్టం చేశాడు.దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చొని బ్లాక్​ లైవ్స్ మ్యాటర్​కు సంఘీభావం తెలపాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డికాక్​.. మోకాళ్లపై కూర్చోవడం ఇష్టం లేక మ్యాచ్​ నుంచి తప్పుకొన్నాడు. దీంతో అతడి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడు వివరణ ఇచ్చాడు.

ముందుగా నా సహా ఆటగాళ్లకు, అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను. దీన్ని క్వింటన్​ సమస్యగా చూపాలనుకోవట్లేదు. జాతివివక్షకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ సంఘీభావ ప్రక్రియకు ఉన్న ప్రాధాన్యం నేను అర్థం చేసుకోగలను. ఇలా సంఘీభావం తెలపడం ఆటగాళ్ల బాధ్యత అని కూడా తెలుసు. మోకాళ్ల మీద కూర్చోవడం వల్ల ఇతరుల జీవితాలు బెటర్​గా ఉంటాయనుకుంటే మోకాలిపై కూర్చోవడం నాకెంతో సంతోషం. వెస్టిండీస్​తో మ్యాచ్​ నుంచి తప్పుకొని ఎవరినీ అగౌరవపరచాలని అనుకోలేదు. ముఖ్యంగా విండీస్​​ జట్టును. నా వల్ల బాధ పడిన ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. నన్ను క్షమించండి. ఆటగాళ్లకు ధన్యవాదాలు. నా దేశం కోసం ఆడటాన్ని ప్రేమిస్తాను అని డికాక్ తెలిపాడు.

బ్లాక్​ లివ్స్​ మ్యాటర్​కు మద్దతుగా నిలవడం ఇష్టం లేక మ్యాచ్​ నుంచి డికాక్ తప్పుకోవడాన్ని వ్యక్తిగత కారణంగా స్వీకరించింది క్రికెట్ సౌతాఫ్రికా. అయితే.. దీనికి సంబంధించి మేనేజ్​మెంట్ నుంచి వివరణ కోరనున్నట్లు తెలిపింది.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More