TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Sports » క్వారంటైన్ లో కోహ్లీ – ‘న్యూ లుక్’ లో మర్మం!..

క్వారంటైన్ లో కోహ్లీ – ‘న్యూ లుక్’ లో మర్మం!..

by Murthy

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్వారంటైన్ బబుల్ లో గడుపుతున్నాడు. అతడున్న అదే హోటల్ లోని అతడి పక్క రూమ్ లోనే విరాట్ భార్య అనుష్క శర్మ దిగింది. వారిద్దరి మధ్యా పలకరింపులు దూరం నుంచే జరుగుతున్నాయి. క్వారంటైన్ లో దూరంగా ఉన్నా ప్రేమ మాత్రం తగ్గిపోలేదంటూ ఆమె పోస్టు పెట్టింది. పలు ఫొటోలను ఇన్ స్టాలో పంచుకుంది. విరాట్ తన రూమ్ బాల్కనీ నుంచి అనుష్కకు హాయ్ చెబుతున్న ఫొటోను, లాన్ నుంచి చెయ్యి ఊపుతున్న ఫొటోలను షేర్ చేసింది. ‘ద 8’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆమె.. ఏం రాయలో తెలియట్లేదంటూ కామెంట్ చేసింది. ‘‘క్వారంటైన్ తో హృదయంలో ప్రేమ ఉప్పొంగుతోంది.. బబుల్ జీవితంలో ప్రేమ.. ఈ రెండింట్లో ఏ క్యాప్షన్ పెట్టాలో అర్థం కావట్లేదు’’ అంటూ ఆమె పోస్ట్ పెట్టింది.

అర్జున్ రెడ్డి బాలీవుడ్‌లో రీమేక్ చేయగా.. అందులో కబీర్ సింగ్ పాత్రని పోషించిన షాహిద్ కపూర్‌లా విరాట్ కోహ్లీ ఉన్నాడంటూ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు నెట్‌ప్లిక్స్ సిరీస్‌లోని ప్రొఫెషర్‌లా ఉన్నాడంటూ కితాబులు ఇస్తున్నారు. మొత్తంగా.. విరాట్ కోహ్లీ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అతని క్వారంటైన్ లుక్‌ని అభిమాని ఒకరు ఫొటోషాప్ చేసినట్లు తెలుస్తోంది.

జూన్ 2న ఇంగ్లాండ్‌ వెళ్లనున్న కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు – అక్కడ సౌథాంప్టన్ న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌లో ఢీకొట్టబోతోంది.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More