మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది. ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ పదవికి రాజీనామా చేసిన అతడు… మంగళవారం నాడు టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు సమర్పించాడు. ద్రవిడ్‌తో పాటు అతడి సన్నిహితుడు పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. మరోవైపు ఫీల్డింగ్ కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, హర్యానాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అజయ్ రత్రా దరఖాస్తు సమర్పించాడు. కాగా బ్యాటింగ్ కోచ్‌గా మాత్రం ప్రస్తుతం ఉన్న విక్రమ్ రాథోడ్ కొనసాగే అవకాశాలున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య శుక్రవారం రాత్రి ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్ తర్వాత రాహుల్ ద్రవిడ్‌తో చర్చలు జరిపిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలు.. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు అతడ్ని ఒప్పించారు.
హెడ్‌కోచ్ పదవితో పాటు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ పదవులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 26లోగా అప్లికేషన్లు సమర్పించాలని స్పష్టం చేసింది. కోచ్ నియామక రేసులో రాహుల్ ద్రవిడ్ ఉండటంతో మిగతావారికి నిరాశే ఎదురుకానుంది. రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఖాయమైపోయింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌తో పాటు భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ వరకు ద్రవిడ్ పర్యవేక్షణలోనే టీమిండియా బరిలోకి దిగనుంది. కోచ్ నియామక రేసులో రాహుల్ ద్రవిడ్ ఉండటంతో మిగతావారికి నిరాశే ఎదురుకానుంది. బౌలింగ్ కోచ్‌గా ఆర్. శ్రీధర్ స్థానంలో పరాస్ కోచింగ్ స్టాఫ్‌లో ద్రవిడ్ తీసుకోబోతున్నాడని.. బ్యాటింగ్ కోచ్‌గా మాత్రం విక్రమ్ రాథోడ్ కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లపాటు హెడ్ కోచ్‌గా ఉండనున్న రాహుల్ ద్రవిడ్కి రూ.10 కోట్ల శాలరీని బీసీసీఐ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.