TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Sports » భారత్ ఓటమి జీర్ణించుకోలేక గుండెపోటుతో అభిమాని మృతి.

భారత్ ఓటమి జీర్ణించుకోలేక గుండెపోటుతో అభిమాని మృతి.

by Murthy

ప్రపంచం కళ్లన్నీ ఎప్పటిలాగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మీదే ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ రెండూ గ్రూప్ 2లో ఉన్నాయి.   మ్యాచ్ తర్వాత గెలిచిన దేశం బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకుంటే, ఓడిన జట్టు దేశం విషాదంలో మునిగిపోతుంది. ఆ కోపమంతా టీవీల మీద కూడా చూపిస్తారు. వాటిని బద్దలు కొట్టి ఓటమి భారం దించుకుంటారు. మ్యాచ్ గెలిపించిన ఆటగాడు రాత్రికి రాత్రే హీరో అయిపోతాడు. మ్యాచ్ ఫలితం చివరి ఓవర్లో వస్తే, ఏ బౌలర్ బంతి వల్ల ఓటమి ఎదురైందో అతడు ప్రత్యర్థి దేశంలో అందరికీ విలన్ అయిపోతాడు. మరికొందరు ఇండియా అపజయాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో చనిపోతున్నారు.  మరీ సున్నితమనస్కులైతే ఆత్మహత్యలకు పాల్పడటం మనం గమనించవచ్చు. టీ 20 ప్రపంచ కప్‌లో భారత్‌ ఓటమి చెందడంతో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కర్ణాటక రాష్ట్రంలోని  కొడగు జిల్లా సోమవారపేట తాలూకా దొడ్డబళె గ్రామానికి ఉదయ్‌ క్రికెట్‌ అభిమాని. భారత్‌–పాకిస్తాన్‌ మ్యాచ్‌ తిలకిస్తూ భారత్‌ ఓటమి అంచున ఉండటంతో ఉదయ్‌ తీవ్ర ఒత్తిడికి గురికావడంతో గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.  కాగా, ఆదివారం జరిగిన పోరులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్‌ ఏ మాత్రం తడబాటు లేకుండా, వికెట్‌ నష్టపోకుండా అలవోకగా విజయాన్ని అందుకుందన్న సంగతి తెలిసిందే.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More