సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ నెల 24న జరిగే మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో ఎక్కువగా దాయాది జట్టునే విజయం వరించింది. అయితే అన్ని ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో మాత్రం పాకిస్థాన్ మీద టీమిండియాదే పైచేయి. వన్డే వరల్డ్‌కప్‌లు సహా టీ20 ప్రపంచకప్ మ్యాచుల్లో పాక్‌పై భారత్ దే సంపూర్ణ ఆధిపత్యం. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు.. టీ20 వరల్డ్‌కప్‌లో ఐదుసార్లు ఢీకొన్నాయి. అన్నింట్లోనూ టీమిండియానే గెలుపొందింది. ఈ ఆదివారం మళ్లీ తలపడనున్న నేపథ్యంలో ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారనేది ఉత్కంఠగా మారింది.
భారతదేశం 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ టీమిండియా ప్రీమియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం జరుగుతున్న ఐసిసి టి 20 ప్రపంచ కప్ 2021 లో “ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్” అవార్డును గెలుచుకోవాలని కోరుకుంటున్నాడు, పాకిస్థాన్‌తో మ్యాచ్‌ని నిర్ణయించడంలో ఆల్ రౌండర్ కూడా బుమ్రా నిర్ణయాత్మక పాత్ర పోషించగలడు. దుబాయ్‌లో ఆదివారం (అక్టోబర్ 24) జరగాల్సి ఉంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడే బుమ్రా ఐపిఎల్ 2021 లో అత్యధిక వికెట్లు తీసిన మూడో వ్యక్తిగా నిలిచాడు-14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు. అతను ఇంగ్లాండ్‌తో జరిగిన టీ 20 వరల్డ్ కప్ 2021 మొదటి వార్మప్ మ్యాచ్‌లో 1/26 – బౌలింగ్ చేశాడు.
పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత్ నిరాకరించడంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు నిలిచిపోయాయి. అయితే క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి ఇరు జట్లు 199 మ్యాచ్‌ల్లో ఢీకొనగా.. భారత్ 70 మ్యాచుల్లో విజయం సాధించింది. పాకిస్థాన్ 86 విజయాలను నమోదు చేసింది. మరో 42 మ్యాచ్‌లు ఫలితం తేలకుండానే ముగిశాయి. ఇందులో 59 టెస్టులు ఆడగా.. భారత్ 9, పాకిస్థాన్ 12 మ్యాచుల్లో విజయం సాధించాయి. 38 మ్యాచులు డ్రాగా ముగిశాయి. అలానే 132 వన్డేల్లో టీమిండియా 55, పాకిస్థాన్ 73 మ్యాచుల్లో గెలుపొందగా నాలుగు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. టీ20ల్లో ఆధిక్యం మాత్రం భారత్‌దే. ఎనిమిది మ్యాచుల్లో ఆరు టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పొరుగు దేశం గెలిచింది. మరొక మ్యాచ్ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది