TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కి జూనియర్ ఎన్టీఆర్ పేకప్ చెప్పేసాడా!?.

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కి జూనియర్ ఎన్టీఆర్ పేకప్ చెప్పేసాడా!?.

by Murthy

జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షోకు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తోంది.  బుల్లితెరలో రియాలిటీ షోగా మంచి సక్సెస్ అందుకున్న షో – మీలో ఎవరు కోటీశ్వరుడు ఇప్పటికే పలు సీజన్ లు పూర్తి కాగా, ఇటీవలే జెమినీలో ఎవరు మీలో కోటీశ్వరులుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీజన్ 1 తొలి ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరుకాగా అనంతరం దర్శకులు రాజమౌళి, కొరటాల శివ వచ్చారు. ఇటీవల దసరా పండగ సందర్భంగా హీరోయిన్ సమంత గెస్టుగా వచ్చి రూ.25 లక్షలను గెలుచుకుంది. త్వరలో ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తారక్ షోలో మెరవనున్నారు. అయితే ఏపీ, తెలంగాణ నుంచి ఎందరో సామాన్యులు ఈ షోకు వచ్చి పాల్గొంటుండగా ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కూడా రూ.కోటిని గెలుచుకోలేదు. త్వరలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌లో అయినా ఎవరైనా రూ.కోటి గెలుచుకుంటారేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు సీజ‌న్ 1కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను ఎన్టీఆర్ పూర్తి చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

సీజన్ 1కు సంబంధించి నిర్వాహకులు మొత్తం 60 ఎపిసోడ్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 37 ఎపిసోడ్లు టీవీలో టెలీకాస్ట్ అయ్యాయి. మరో 23 షోలకు సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. సీజన్ 1 మొత్తానికి తారక్ రూ.7.5 కోట్లను రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఒక‌వైపు సినీ సెల‌బ్రిటీలు, మ‌రోవైపు సామాన్యుల‌తో ఈ ప్రోగ్రామ్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తూ వ‌చ్చారు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More