TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » వాట్సాప్ లో ఇకమీదట సరికొత్త ఫీచర్ … గ్రూప్ చాటింగ్!..

వాట్సాప్ లో ఇకమీదట సరికొత్త ఫీచర్ … గ్రూప్ చాటింగ్!..

by Murthy

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన కస్టమర్లకు ప్రైవసీపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వాట్సాప్ తన వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి  కొత్త ఫీచర్లు జత చేస్తూనే ఉంటుంది.  , ఇప్పటికే చాలా ఫీచర్లను అందించినా కూడా వినియోగదారుల అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా కొత్త ఫీచర్లను ఇంకా జతచేస్తూనే వుంది. ఈ అప్ కమింగ్ ఫీచర్లలో కొన్ని ఫీచర్లు ఇప్పటికే బీటా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి మరియు మరికొన్ని ఫీచర్లు డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి.   రానున్న కొద్దీ కాలంలోనే వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.    వాటిలో చాలావరకు ఫీచర్స్ యూజర్లకు ఉపయోగపడేవే.  ఇప్పటికే తన కస్టమర్ల డేటా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. డేటా ఇతర వ్యక్తులకు కనిపించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అందుకు తగినట్లుగానే ఫీచర్స్‌ అందుబాటులోకి తీసుకువస్తోంది. 

వాట్సాప్ లో కమ్యూనిటీ ఫీచర్ గనుక అందుబాటులోకి వస్తే ప్రస్తుతం మనం గ్రూప్స్ లో చేస్తున్న మెసేజింగ్ విధానం పూర్తిగా మారే అవకాశం ఉంది. మిగతా యాప్స్ తో పోలిస్తే వాట్సాప్ లో గ్రూప్ చాటింగ్ అనుభవం సరికొత్తగా ఉంటుందంటున్నారు.   వాట్సాప్ లో త్వరలోనే కొత్త ఫీచర్ రాబోతోందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాట్సాప్ లో ఇప్పటికే చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా రాబోతున్నది గ్రూప్ చాటింగ్. వాట్సాప్ లో ఇప్పటికే గ్రూప్స్ ఉన్నా, గ్రూప్ చాటింగ్ అందుబాటులో లేదు. త్వరలో కమ్యూనిటీ ఫీచర్ వస్తుందని అంతా భావిస్తున్నారు. XDA డెవలపర్స్ చెప్పిన దాని ప్రకారం ఈ టెక్నాలజీ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంలలో దీన్ని ప్రవేశపెడతారు. అప్పుడు వాట్సాప్ లో కమ్యూనిటీ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్న వారు గ్రూప్ చాటింగ్లో పాల్గొనేందుకు వీలవుతుంది.

whatsapp-a-new-group-chatting-feature-will-be-introduced-soon

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More