ఐపీఎల్ సీజన్ ని కాష్ చేసుకునేందుకు టెలికం దిగ్గజం రిలయెన్స్ జియో, ఐపీఎల్ క్రికెట్ లవర్స్ కోసం కొత్త క్రికెట్ ప్లాన్స్ మరియు ఆఫర్స్ మన ముందుకు తీసుకొని వచ్చింది. ఐపీల్ చూడాలంటే డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ కొనకుండానే ఫ్రీ గా ప్రతి ఒక్కరు తమ స్మార్ట్‌ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూసే విధంగా ఎన్నో డేటా ప్లాన్స్ అనౌన్స్ చేసింది జియో.
జియో యూజర్స్ ఐపీఎల్ మ్యాచులు లైవ్ లో చూసేందుకు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ని తన డేటా ప్లాన్స్ తో ఉచితంగా అందిస్తుంది.
ఐపీల్ క్రికెట్ సీజన్లో ని దృష్టిలో పెట్టుకొని జియో వినియోగదారుల కోసం ఎక్కువ 4జీ డేటాతో పాటు వాయిస్, టెక్స్ట్ బెనిఫిట్ తో జియో క్రికెట్ ప్లాన్స్‌లో ప్రవేశ పెట్టింది .

ఆ ప్లాన్స్ వివరాలు ఇప్పుడు చుద్ద్దాం.
జియో రూ 401 ప్లాన్ :జియో రూ.401 ఆఫర్ తో రీఛార్జ్ చేసేవారికి రోజుకు 3 జీబీ డేటా 28 రోజుల వాలిడిటీ తో లభిస్తుంది, దానితో పాటు రూ.399 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.
జియో రూ 598 ప్లాన్ : జియో రూ.598 ఆఫర్ తో రీఛార్జ్ చేసేవారికి రోజుకు 2 జీబీ డేటా 56 రోజుల వాలిడిటీతో లభిస్తుంది, దానితో పటు రూ.399 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.

జియో రూ 777 ప్లాన్ : జియో రూ.777 ఆఫర్ తో రీఛార్జ్ చేసేవారికి రోజుకు 1.5 జీబీ డేటా 84 రోజుల వాలిడిటీతో లభిస్తుంది. దానితో పాటు రూ.399 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.
జియో రూ 2599 ప్లాన్ : జియో రూ.2599 ఆఫర్ తో రీఛార్జ్ చేస్కునే యూజర్స్ కి రోజుకు 2 జీబీ డేటా 365 రోజుల వాలిడిటీతో లభిస్తుంది అలాగే ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు రూ.399 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
ఒకవేళ యూజర్స్ డేటా ఎక్కువ గా కావాలి అనుకుంటే ఆడ్ ఆన్ ప్లాన్స్ కుడా జియో ప్రవేశ పెట్టింది:
జియో రూ 499 ఆడ్ ఆన్ ప్లాన్ తో రీఛార్జ్ చేసేవారికి రోజుకు 2 జీబీ డేటా 56 రోజుల వాలిడిటీతో లభిస్తుంది. దానితో పాటు రూ.399 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.