TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » వ్యాక్సిన్ వేసుకుంటేనే రేషన్‌, గ్యాస్‌, పెట్రోల్‌!

వ్యాక్సిన్ వేసుకుంటేనే రేషన్‌, గ్యాస్‌, పెట్రోల్‌!

by Murthy

వ్యాక్సిన్​ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఆ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. దీంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి సంబంధిత సంస్థలు. కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని సిబ్బందికి జీతాలు చెల్లించబోమని ఇప్పటికే ప్రకటించింది మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్​ కార్పొరేషన్​(టీఎంసీ). ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. కనీసం టీకా ఒక డోసు వేసుకున్నవారికి మాత్రమే రేషన్‌, పెట్రోల్‌, గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయాలని డీలర్లు, ఏజెన్సీలకు ఆ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని వారిపై విపత్తు యజమాన్య చట్టం, మహమ్మారి వ్యాధుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాక్సిన్‌ కార్యక్రమం మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

మహారాష్ట్రలో ఔరంగాబాద్ టీకా పంపిణీలో వెనుకంజలో ఉన్నది. ప్రధాన మంత్రే స్వయంగా ఇక్కడ టీకా పంపిణీ వేగం పెంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వమూ ఈ నెలాఖరులోగా అర్హులైన వారందరికీ టీకా వేయాలని నిర్దేశించింది. టీకా వేసుకోని వారికి పెట్రోల్, గ్యాస్, రేషన్ అందబోదని, జిల్లా దాటే ఆస్కారం ఉండదని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో 74% మంది టీకాలు వేయించుకుంటే ఔరంగాబాద్‌లో అది 55 శాతం మాత్రమే. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో 26వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు ఈ కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ చర్యలతోనైనా వ్యాక్సిన్‌ పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.

18ఏళ్లు పైబడి ఫస్టు డోసు తీసుకోని వారు రెండు డోసుకూ అర్హత ఉండి కూడా వేసుకోని వారిని జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైనా బీబీ కా మక్బారా, అజంతా గుహలు, దౌలతాబాద్ కోట, ఎల్లోరా గుహలకు వెళ్లడాన్ని నిషేధింది. ఒక్క డోసు కూడా తీసుకోని వారు జిల్లా విడిచి బయట అడుగు పెట్టడానికి వీలు లేదని నిబంధన విధించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, టూర్ నిర్వాహకులు కచ్చితంగా రెండు డోసులూ తీసుకుని ఉండాలని నిర్దేశించింది.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More